- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్లూ జెర్సీలో కోహ్లీ సేన
దిశ, స్పోర్ట్స్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇకపై ఆడబోయే ఒక మ్యాచ్‌లో బ్లూ కలర్ జర్సీతో బరిలోకి దిగనున్నది. ఆర్సీబీ సాధారణంగా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో ఉన్న జెర్సీతో బరిలోకి దిగింది. అయితే దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్రంగా మారి భారీ సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అయితే వారిలో చాలా మంది సరైన సమయంలో ఆక్సిజన్ అందక మృత్యువాత పడ్డారు. దేశంలో ఆక్సిజన్ కొరతను దృష్టిలో ఉంచుకొని క్రికెటర్లు, ఫ్రాంచైజీలు భారీగా విరాళాలు అందిస్తున్నాయి. పాట్ కమిన్స్, బ్రెట్‌లీ, శ్రీవత్స్ గోస్వామి, నికొలస్ పూరన్, సచిన్ టెండుల్కర్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్ ఇప్పటికే విరాళాలు అందించాయి.
తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ఈ పోరాటంలో ముందుకు వచ్చింది. గత ఏడాది కాలంగా ఎంతో మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ పీపీఈ కిట్లు ధరించి కరోనా రోగులకు సేవలు చేస్తున్నారు. వారికి సంఘీభావంగా ఆర్సీబీ జట్టు బ్లూ జెర్సీలు ధరించి బరిలోకి దిగనున్నది. కాగా, ఆక్సిజన్ అందని పలు ప్రాంతాలను గుర్తించి అందుకు అవసరమైన సహాయం కూడా చేయనున్నట్లు ఆర్సీబీ తెలిపింది. ఈ మేరకు కోహ్లీ వీడియోను ట్విట్టర్‌లో విడుదల చేసింది. బెంగళూరు సహా ప్రధాన నగరాల్లో ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి ఆర్సీబీ నిర్ణయించుకున్నది.