- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. బుజ్జగిస్తున్న యాజమాన్యం..!
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కెప్టెన్సీని విరాట్ కోహ్లీ వదిలేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2021 రెండో దశకు ముందే తాను కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కెప్టెన్‌గా లేకపోయినా ఆర్సీబీ యాజమాన్యం మాత్రం కోహ్లీని రూ. 15 కోట్లకు అట్టిపెట్టుకున్నది. ఇక విరాట్ కోహ్లీ ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీకి పూర్తిగా దూరమయ్యాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆర్సీబీ జట్టు కోహ్లీతో కెప్టెన్సీ విషయమై చర్చించినట్లు తెలిసింది. కోహ్లీ సన్నిహితుల ద్వారా ఆర్సీబీ యాజమాన్యం అతడితో కెప్టెన్సీని తిరిగి చేపట్టాలని కోరినట్లు సమాచారం.
ఆర్సీబీ కెప్టెన్సీని ఈ సమయంలో మార్చలేమని.. వచ్చే సీజన్‌లో కొత్త ఆటగాళ్లు జట్టులో చేరతారు కాబట్టి కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే అందరినీ సమన్వయ పరుస్తాడని యాజమాన్యం భావిస్తున్నది. ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేని కోహ్లీ.. సన్నిహితుల వద్ద ఆర్సీబీ కెప్టెన్సీ గురించి చర్చించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్సీ విషయంలో సుముఖంగానే ఉన్నా.. ఇప్పుడే తన నిర్ణయాన్ని చెప్పలేనని అన్నట్లు సమాచారం. కేవలం టెస్టు జట్టు కెప్టెన్సీకే పరిమితం అయినందున.. కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.