- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లలో మార్పులు ఉండకపోవచ్చు
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా పెరుగుతున్న వస్తువుల ధరలు, దేశీయంగా ద్రవ్యోల్భణ పరిణామాల నేపథ్యంలో ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. కొవిడ్ కారణంగా ఆర్థికవ్యవస్థలో డిమాండ్ పెంచేందుకు ఆర్‌బీఐ 2020, మేలో 40 బేసిస్ పాయింట్ల వరకు 4 శాతానికి తగ్గించింది. అప్పటినుంచి కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు తీసుకోలేదు. కరోనా సంబంధిత పరిణామాలు ఇంకా కొనసాగుతున్న సమయంలో ఆర్‌బీఐ వరుసగా ఎనిమిదోసారి వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించే అవకాశం ఉంది.
ఆర్‌బీఐ గవర్నన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) అక్టోబర్ 6-8 తేదీల్లో మూడు రోజుల పాటు సమావేశం కానుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ 8న ప్రకటించనున్నారు. ఈ క్రమంలో పరిశోధనా సంస్థలు ఈ విధాన సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచాలని, అనుకూల వైఖరిని కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్టు చెబుతున్నాయి. వృద్ధి సానుకూలంగా ఉంది. సరఫరాకు సంబంధించి అంతరాయాలను పరిష్కరించిన తర్వాత ద్రవ్యోల్భణం అదుపులో ఉండవచ్చు. కాబట్టి ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లలో మార్పులు చేయకపోవచ్చని ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖారా చెప్పారు.