ఆర్‌బీఎల్ బ్యాంకుకు రూ. 2 కోట్ల జరిమానా

by Harish |
RBL
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆర్‌బీఎల్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రూ. 2 కోట్ల భారీ జరిమానా విధించింది. డిపాజిట్, బోర్డు నియమాలను ఉల్లంఘించిన కారణంగా ఈ జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఈ చర్యలు నియంత్రణ ఆదేశాలను పాటించడంలో లోపాలపై ఆధారపడి తీసుకున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. 2016, ఆర్‌బీఐ ఆదేశాలు, 1949 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, సెక్షన్ 10ఏ సబ్‌సెక్షన్2 నిబంధన(బి)ని పాటించకపోవడంతో ఆర్‌బీఐ బ్యాంకుకు ఈ జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ వివరించింది.

2019కి సంబంధించి రిస్క్ మేనేజ్‌మెంట్ రిపోర్ట్, ఇన్‌స్పెక్షన్ నివేదికలను పరిశీలించిన అనంతరం ఆర్‌బీఎల్ బ్యాంకు ఆయా ఆదేశాలను ఉల్లంఘించినట్టు స్పష్టం చేసింది. ఇంకా, సహకార బ్యాంకు పేరుతో ఐదు పొదుపు ఖాతాలను ప్రారంభించడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది. ఈ ఉల్లంఘనలకు జరిమానా ఎందుకు విధించకూడదో వివరించాలని ఆర్‌బీఎల్ బ్యాంకుకు ఆర్‌బీఐ నోటీసులు జారీ చేసింది. బ్యాంకు ప్రత్యుత్తరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ జరిమానాను ఆర్‌బీఐ విధించింది.

Advertisement

Next Story

Most Viewed