డిజిటల్ కరెన్సీపై ఆర్‌బీఐ ఆసక్తి!

by Harish |
డిజిటల్ కరెన్సీపై ఆర్‌బీఐ ఆసక్తి!
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్నాళ్లుగా డిజిటల్, క్రిప్టో కరెన్సీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రూపాయికి డిజిటల్ వెర్షన్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. ఇదివరకు ఇలాంటి వర్చువల్ కరెన్సీలపై సందేహాలను వెలిబుచ్చిన ఆర్‌బీఐ ఇప్పుడు వీటి పట్ల ఆసక్తి చూపిస్తోందని తెలుస్తోంది. కరోనా సంక్షోభం తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరగడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇందులో భాగంగానే డిజిటల్ కరెన్సీ కార్యకలాపాల నిర్వహణ కోసం ఆర్‌బీఐ అన్వేషిస్తోంది.

ఇటీవల ఓ నివేదిక ప్రకారం..అంతర్జాతీయంగా అత్యధికంగా డిజిటల్ చెల్లింపులను నిర్వహిస్తున్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. అమెరికా, బ్రిటన్ దేశాల కంటే గరిష్ఠంగా భారత్‌లో డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో డిజిటల్ చెల్లింపులకు సంబంధించి నియంత్రణను సరళతరం చేసేందుకు అవసరమైన వ్యవస్థను రూపొందించాలని, దానికోసం రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ యోచిస్తోంది. ఇందులో భాగంగా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్, బీమా సేవల సంస్థ ఐఆర్‌డీఏలతో చర్చలు జరుపుతోంది.

Advertisement

Next Story