- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిజిటల్ రుణాల పర్యవేక్షణకు ఆర్‌బీఐ వర్కింగ్ గ్రూప్!
దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా పెరుగుతున్న డిజిటల్ రుణాల మోసాలను నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ రుణాలకు సంబంధించి అధ్యయం చేయడానికి ప్రత్యేకంగా వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ వర్కింగ్ గ్రూప్ రుణాల యాప్‌లతో పాటు ఇతర డిజిటల్ రుణాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా డిజిటల్ రుణాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనుంది. ‘ఇటీవల ఆర్థికరంగంలో పలు డిజిటల్ పద్దతులను స్వాగతించే అంశమే అయినప్పటికీ, వీటివల్ల ప్రయోజనాలతో పాటు అనుకోని సమస్యలు, సవాళ్లు కూడా ఉన్నాయి. డేటా భద్రత, ప్రైవసీ, విశ్వాసం, వినియోగదారుల భద్రతకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. దానికి తగినటువంటి నియమాలను, నిబంధనలను రూపొందించాలని’ ఆర్‌బీఐ తన ప్రకటనలో వెల్లడించింది.
ఈ మధ్య డిజిటల్ రుణాలను ఇచ్చే యాప్‌ల వల్ల సమస్యలు పెరిగాయని ఆర్‌బీఐ ఆందోళల వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇటువంటి సమస్యలను తొలగించేందుకు, వినియోగదారులకు భద్రత ఇచ్చేందుకు ఆర్‌బీఐ వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. భవిష్యత్తులో ఆన్‌లైన్ ద్వారా రుణాలను అధ్యయనం చేస్తుందని వివరించింది. కాగా, ఇప్పటివరకు ఉన్న వివరాల ప్రకారం..గూగుల్ పే స్టోర్ నిబంధనలను అతిక్రమిస్తూ దాదాపు పదికి మించి డిజిటల్ యాప్‌లు ఆన్‌లైన్‌లో రుణాలను ఇస్తున్నాయి. ఈ యాప్‌లు రుణాల పేరుతో అత్యధిక వడ్డీలను విధిస్తుండటంతో చెల్లించలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ డిజిటల్ మోసాలను గుర్తించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది.