యునైటెడ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ!

by Harish |
యునైటెడ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ!
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని బాగ్నన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యునైటెడ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రద్దు చేసింది. ఈ నెల 10 నాటి ఉత్తర్వుల ద్వారా సహకార బ్యాంకు బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించడాన్ని మే 13(గురువారం) నుంచి నిషేధిస్తున్నట్టు ఆర్‌బీఐ గురువారం ప్రకటించింది. పశ్చిమ బెంగాల సహకార సంఘాల రిజిస్ట్రార్ కూడా బ్యాంకును మూసివేసేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని, బ్యాంకుకు లిక్విడేటర్‌ను నియమించాలని కేరారు.

బ్యాంకు వద్ద తగినంత మూలధనం లేకపోవడం, సంపాదించే అవకాశాలు లేనందున లైసెన్సును రద్దు చేస్తున్నట్టు ఆర్‌బీఐ వివరించింది. అయితే, బ్యాంకులోని డిపాజిటర్లు తమ డిపాజిట్ల మొత్తాన్ని డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుంచి తీసుకునే వెసులుబాటు ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. ఈ బ్యాంకు వ్యాపారాలను కొనసాగించేందుకు అనుమతిస్తే ప్రజా ప్రయోజనాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed