రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు మూడోసారి బ్రేక్

by Shyam |   ( Updated:2021-08-04 21:56:20.0  )
Rayalaseema Upliftment Scheme
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన మూడోసారి వాయిదా పడింది. గురువారం కేఆర్​ఎంబీ, సీడబ్ల్యూసీ ఇంజినీర్లు రాయలసీమ పరిశీలనకు వెళ్లాల్సి ఉండగా బుధవారం రాత్రి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేఆర్​ఎంబీ సభ్య కార్యదర్శి రాయపురే లేఖ విడుదల చేశారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు వెళ్లాల్సి ఉందని, దీని కోసం ఈ నెల 5న టూర్​ఖరారు చేసినట్లు వివరించారు. కానీ పలు కారణాలతో వాయిదా వేసుకున్నామని, మళ్లీ పర్యటన వివరాలు చెప్పుతామంటూ లేఖలో పేర్కొన్నారు. కాగా రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన టూర్​మూడోసారి వాయిదా పడింది.

ఇప్పటికే రెండుసార్లు నిపుణుల బృందం అక్కడకు వెళ్లేందుకు ఏపీకి లేఖ రాశారు. కానీ నోడల్ ​అధికారిని ఏర్పాటు చేసేందుకు ఏపీ ముందుకు రాలేదు. ఇప్పుడు కూడా ఏపీ నుంచి రిప్లై లేకపోవడంతో నిపుణుల బృందం పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 9న ఎన్జీటీలో ఈ విషయంపై నివేదిక ఇవ్వాల్సి ఉంది. మరో నాలుగు రోజులే గడువు ఉండటంతో పరిశీలన టూర్ ​ఉంటుందా.. అనేది అనుమానంగా మారింది. అయితే కేఆర్​ఎంబీ తరుపున మళ్లీ వాయిదా కోరేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed