‘కొడుకుతో మొబైల్ లో ఆడుతున్న రవితేజ’

by Jakkula Samataha |   ( Updated:2020-04-27 04:05:02.0  )
‘కొడుకుతో మొబైల్ లో ఆడుతున్న రవితేజ’
X

దిశ వెబ్ డెస్క్: లాక్‌డౌన్ కారణంగా సామాన్యులు నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ షూటింగ్‌లు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండే సినీ తారలంతా ఇంట్లోనే ఉంటూ.. కుటుంబ సభ్యులతో హ్యపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓ వైపు ఢిఫరెంట్ వంటకాలు ట్రై చేస్తూ, వర్కవుట్ లు చేస్తూ, పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ సూపర్ గా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మరో వైపు సినిమాలు లేకపోవడంతో.. అభిమానులతో టచ్ లో ఉండటానికి, క్వారంటైన్ టైమ్ లో వారినీ ఎంటర్ టైన్ చేయడానికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పుడో కానీ ఆన్ లైన్ లో కనిపించని తారలు కూడా వరస ట్వీట్లు, పోస్టులతో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. ఇటీవలే చిరంజీవి కూడా సోషల్ మీడియాలో అడుగుపెట్టి, అభిమానులను అలరిస్తున్నారు మాస్ మహారాజా రవితేజ కూడా సోషల్ మీడియాతో అభిమానులకు చేరవవుతున్నారు. ఈ క్వారంటైన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ‘చెకింగ్ ఆన్ మై డీఎన్ కె’ అంటూ తన కొడుకుతో ఉన్న ఫోటోను షేర్ చేశారు.

సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషించని రవితేజ.. ఈ లాక్‌డౌన్ సమయంలో మాత్రం చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు తాను ఇంట్లో ఏం చేస్తున్నాడో తెలుపుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. తన కొడుకు, కూతురులను పరిచయం చేస్తూ లాక్ డౌర్ పీరియడ్ లో.. ప్రతిరోజు ఆదివారంలా గడిచిపోతోందని ఇటీవలే పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా … తన కొడుకు మహాధన్‌తో ఇంట్లో సరదాగా గడుపుతున్న ఫోటో షేర్ చేసి తన అభిమానులను ఖుషీ చేశారు. ఆ ఫోటోకు జతగా .. ”చెకింగ్ ఆన్ మై డీఎన్‌కె” అని ట్యాగ్ చేశారు. కొడుకు మహాధన్‌ మొబైల్ చూస్తుంటే రవితేజ సీరియస్‌గా చూస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. . రవితేజ నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' 'రాజా ది గ్రేట్' చిత్రాల్లో మహాధన్ కనిపించాడు. రవితేజ ప్రస్తుతం 'క్రాక్' చిత్రంలో నటిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. లాక్‌డౌన్ పూర్తి కాగానే ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

tags :ravi teja, mahadhan, lockdown, quarantine, family time, social media

Advertisement

Next Story