బ్లాక్ బెల్ట్ చూపిస్తున్న రవీనా టాండన్

by Jakkula Samataha |
బ్లాక్ బెల్ట్ చూపిస్తున్న రవీనా టాండన్
X

దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ పుత్రికోత్సాహంతో పొంగిపోతోంది. తన కూతురు రాషా తడాని తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించడమే తన ఆనందానికి కారణం. ఈ సందర్భంగా బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్‌ను చూపిస్తూ తల్లీ కూతుళ్లిద్దరూ ఫొటోకు పోజిచ్చారు. కాగా ఈ ప్రౌడ్ మూమెంట్‌ను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేస్తూ హ్యాపీ నోట్ రాసుకొచ్చింది రవీన. రాషా అచీవ్‌మెంట్‌కు తల్లిగా గర్వపడుతున్నానని తెలిపిన రవీన.. ఇంత సాధించినా ‘రేపు స్కూల్‌కు వెళ్లాలి’ అని చెప్పడం చాలా హ్యాపీగా ఉందని వెల్లడించింది. ఇక ఈ పిక్‌లో రాషా తన బ్లాక్ బెల్ట్‌ను నడుముకు చుట్టుకోగా, ఇద్దరూ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సుల్లో కనిపించారు. రవీన ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. పాన్ ఇండియా ఫిల్మ్ ‘కేజీఎఫ్2’లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story