రేవ్ పార్టీ కలకలం.. సీఐ, ప్రముఖులను సైడ్ చేసిన పోలీసులు.?

by srinivas |
Rave-Party
X

దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో రేవ్ పార్టీ కల్చర్ కలకలం రేపింది. జిల్లాలోని లక్ష్మీపురంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో సోమవారం అర్ధరాత్రి పట్టాభిపురం పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్‌లో ఐదుగురు మహిళలు, 20 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే ఈ రేవ్ పార్టీలో ఉన్న ఒక సీఐతో పాటు మరో ముగ్గురు ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేయకుండా తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై పోలీసులు ఇప్పటి వరకు స్పందించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.

Advertisement

Next Story

Most Viewed