- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వలస కార్మికులకు రేషన్ కార్డులు
దిశ, తెలంగాణ బ్యూరో : వలస కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రేషన్ కార్డులతో పాటు వలస కార్మికులకు సంబంధించి ఆరోగ్య సంరక్షణ కోసం చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి తెలిపారు. వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు విద్యా సదుపాయాలను అందించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన వివరించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉపాధి పనుల కోసం రాష్ట్రానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోతున్నారు.
గతేడాది నుంచి వరుస లాక్ డౌన్ పరిస్థితుల్లో వారికి బియ్యం, ఆహారం పొందడం కూడా తీవ్రమైన సమస్యగా మారింది. సరైన భోజనం, వసతులు కూడా లేకపోవడంతో సొంత ప్రాంతాలకు వెళ్లేందుకే ఆసక్తి చూపించారు. ప్రభుత్వాలు ఉచితంగా ప్రకటించిన రేషన్ అందక అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో రేషన్ కార్డులు అందితే వలస కార్మికులకు ఓ భరోసా లభించినట్టవుతుంది.