- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం: ఐసీయూలో రోగిని కొరికి చంపిన ఎలుకలు..
దిశ, వెబ్‌డెస్క్: అదేమీ చిన్నాచితకా హాస్పిటల్ కాదు. మహానగరం నడిబొడ్డున ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. నిత్యం ఎంతోమంది రోగులకు ప్రాణాలు పోస్తున్న ఆసుపత్రి. కానీ, ఆ ఆసుపత్రి లో పరిశుభ్రత మాత్రం కరువైంది. హాస్పిటల్ అనగానే శుభ్రతకు మారుపేరుగా ఉంటుంది అనేది అందరికి తెలిసిందే. కానీ ఈ హాస్పిటల్ దానికి భిన్నం. అందుకు నిదర్శనమే ఈ వ్యక్తి మరణం. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగిని ఓ ఎలుక కొరికి చంపిన ఘటన ముంబైలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..
కుర్లా, కమానీ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ ఎల్లప్ప అనే వ్యక్తి శ్వాస కోసం సంబంధిత సమస్యతో బాధపడుతుంటే రెండు రోజుల క్రితం ఆయనను ఘాట్కోపర్‌లో బృహన్ ముంబై కార్పొరేషన్‌కు చెందిన రాజావాడి ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆయనను పరీక్షించిన వైద్యులు శ్రీనివాస్ కు మెదడువాపు, కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని చెప్పి ఐసీయూలో చేర్పించి చికిత్స మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం శ్రీనివాస్ కంటికి రక్తం కారడం గమనించిన కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు. అది గమనించిన డాక్టర్లు ఎలుక కొరికిందని నిర్దారించారు.
అదృష్టవశాత్తు కన్నుకు ఎక్కువగా గాయం కాలేదని.. పెద్దగా ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. కానీ 24 గంటలు కూడా గడువకముందే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రోగి బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. బెడ్‌పై చికిత్స పొందుతున్న రోగిని కొరికి చంపడం యాజమాన్యం నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నదని మండిపడ్డారు. ఇంత జరిగిన ఆసుపత్రి యాజమాన్యం తామెకేమి పట్టనట్లు ఉండడం గమర్హం. ఈ ఘటనను బీఎంసీ పరిపాలనా విభాగం సీరియస్‌గా తీసుకున్నదని, ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీచేశామని ముంబై మేయర్ కిశోరీ పెడ్నేకర్ చెప్పారు.