- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రషీద్ ఖాన్
దిశ, స్పోర్ట్స్: ఆఫ్గనిస్తాన్ టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టార్ స్నిన్నర్ రషీద్ ఖాన్ తప్పుకున్నాడు. టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల కారణంగా తనపై భారం పడుతున్నదని.. అది ఆటపై ప్రభావం చూపుతున్నదనే కారణంతో రషీద్ తప్పుకున్నట్లు తెలిసింది. కాగా, తరచుగా ఆఫ్గనిస్తాన్ జట్టు కెప్టెన్లు మారుతూ ఉంటారు. ఈ వారం ప్రారంభంలో ఆఫ్గనిస్తాన్ టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్‌గా హష్మతుల్లా షాహీదిని నియమించారు. టీ20 జట్టుకు మాత్రం ఇంకా కెప్టెన్‌ను నియమించలేదు.
‘నేను ఏమి చేయగలనో నా మనసుకు తెలుసు. నేను ఒక ఆటగాడిగానే రాణించగలను తప్ప కెప్టెన్సీ చేయలేను. అయితే వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నెరవేర్చగలను. కెప్టెన్‌కు సలహాలు ఇస్తూ తగిన పాత్ర పోషించగలను. నా మంచి కొరకే కెప్టెన్సీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను’ అని రషీద్ ఖాన్ చెప్పాడు. తమ జట్టు కోసం మంచి ప్రదర్శన చేయాలని అనుకుంటున్నానని, త్వరలో టీ20 వరల్డ్ కప్ కోసం సన్నదం కావాలంటే అదనపు భారం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రషీద్ ఖాన్ చెప్పాడు.