అమ్మా.. ఇంత కష్టమా? : రష్మిక

by Jakkula Samataha |
అమ్మా.. ఇంత కష్టమా? : రష్మిక
X

అందాల భామ రష్మిక మందన్న.. సౌత్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న ఈ కన్నడ భామ.. తమిళ్‌లో హీరో విజయ్ పక్కన నటించే చాన్స్ కొట్టేసింది. కానీ కరోనా కారణంగా ఇంకా షూటింగ్ మొదలు పెట్టకపోవడంతో ఇంటికే పరిమితమైంది. లాక్‌డౌన్‌లో అమ్మానాన్న, చెల్లితో కలిసి ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఎంజాయ్ చేసిన రష్మిక.. అమ్మో అమ్మకు ఇన్ని కష్టాలుంటాయా అంటోంది.

https://twitter.com/iamRashmika/status/1278270075376562176?s=19

తాజాగా చెల్లి, కుక్క పిల్లతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన రష్మిక.. తన చెల్లి, పెట్ డాగ్ అల్లరి భరించలేకపోతున్నట్లు చెప్తోంది. ఇద్దరినీ కంట్రోల్ చేయలేకపోతున్న లిల్లీ.. ఒకేసారి ఇద్దరు పిల్లలను పెంచే అమ్మ బాధ ఇప్పుడు అర్థమవుతోందని చెప్తోంది.

ఈ పిక్ చూసిన ఫ్యాన్స్.. సూపర్ క్యూట్‌గా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ‘ఏం కాదు రష్మిక.. ఫ్యూచర్‌లో నీకు కూడా మల్టీ టాస్కింగ్ అలవాటైపోతుందని చెప్తున్నారు.

Advertisement

Next Story