ఆ బాలీవుడ్ హీరోనే నా టార్గెట్ అంటున్న టాలీవుడ్ బ్యూటీ

by Anukaran |   ( Updated:2021-04-10 22:49:45.0  )
ఆ బాలీవుడ్ హీరోనే నా టార్గెట్ అంటున్న టాలీవుడ్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: ‘ఊహలు గుస గుసలాడే’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన అమ్మడు కూసింత సన్నబడి బాలీవుడ్ కి చెక్కేసింది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లందరూ ఇక్కడ తమ టాలెంట్ ని చూపించి బాలీవుడ్ లో పాగా వేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది హీరోయిన్లు బాలీవుడ్ బాట పట్టారు. ఈ లిస్ట్ లో ప్రస్తుతం రాశీ ఖన్నా కూడా చేరిపోయింది.

‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో భారీ హిట్ ని అందుకున్న రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో రాశీ షాహిద్ కపూర్ సరసన హీరోయిన్ గా ఎంపికైన విషయం తెల్సిందే. ఈ సిరీస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సెట్ లో కొన్ని ఫోటోలను రాశీ అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో రాజ్, డీకే, రాశీ మధ్యలో షాహిద్ కూర్చొని షాహిద్ ని వారందరు టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. “వీరు చుట్టూ ఉంటే అసలు డల్ గానే అనిపించదు” అంటూ చెప్పుకొచ్చింది. ఈ సిరీస్ వచ్చే ఏడాది అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నది. మరి ఈ సిరీస్ తో అమ్మడు బాలీవుడ్ లో పాగా వేస్తుందేమో చూడాలి.

Advertisement

Next Story