- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
80 ఏళ్ల వృద్ధురాలికి కుడివైపు గుండె.. అరుదైన శస్త్ర చికిత్స చేసిన వైద్యులు..
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : కుడి వైపు గుండె ఉండి గుండె పోటు బారిన పడిన ఓ వృద్ధురాలు (80)కి అరుదైన శస్త్ర చికిత్స చేసిన గ్లెనిగల్ గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు ఆమె ప్రాణాలు నిలిపారు. సాధారణంగా అందరికీ శరీరంలో ఎడమవైపు గుండె ఉంటే, ఆమెకు మాత్రం అత్యంత అరుదుగా కుడివైపు ఉంది. ఇది పుట్టుకతోనే ఉండటంతో గుండెకు ఉండే బృహద్ధమని కూడా ఎడమవైపు కాకుండా కుడివైపు ఉంది. ఇంత పెద్దవయసులో మహిళకు, అది కూడా కుడివైపు రక్తనాళంలో పూడికలకు చికిత్స చేయడం చాలా రిస్కుతో కూడుకున్నది. అయినా ఆసుపత్రి వైద్యులు ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్టు డాక్టర్ సాయి సుధాకర్ వివరాలు వెల్లడించారు. వృద్ధాప్యంలో గుండెపోటు వస్తే ‘గోల్డెన్ పీరియడ్’లోనే యాంజియోప్లాస్టీ చేస్తేనే వారి ప్రాణాలు నిలుపే అవకాశాలు అధికంగా ఉంటాయని తెలిపారు.
అయితే తాము ప్రాణాలు కాపాడిన వృద్ధురాలిని కుటుంబ సభ్యులు ముందుగా వేరే ఆసుపత్రికి తీసుకెళ్లారని, అక్కడ గుండె కవాటాలు అన్నీ కుడివైపు ఉండటం, బృహద్ధమని క్రమంగా సన్నబడుతూ రావడంతో ముందుగా రోగికి రక్తం పల్చబరిచే మందులు ఇచ్చి అప్పుడు మరో ఆసుపత్రికి తరలించాలనుకున్నారని చెప్పారు. చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఆమెను గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రికి తీసుకొచ్చారని వివరించారు. హాస్పిటల్ లో నిపుణులైన వైద్యబృందం అత్యంత జాగ్రత్తగా ఆమెకు చికిత్స చేశారని, గుండె, రక్తనాళాలు సైతం కుడివైపు ఉన్నా, నూరుశాతం పూడుకుపోయిన బృహద్ధమనికి విజయవంతంగా చికిత్స చేసి వృద్ధురాలి ప్రాణాలు కాపాడినట్లు పేర్కొన్నారు. చికిత్స తర్వాత రోగిని రెండు రోజుల పాటు నిశిత పరిశీలనలో ఉంచామని, చికిత్సకు ఆమె బాగా స్పందించారన్నారు. వైటల్స్ అన్నీ బాగున్నాయని గుర్తించిన తర్వాత ఆమెను డిశ్చార్జి చేయడం జరిగిందని డాక్టర్ సుధాకర్ తెలిపారు.