- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లాక్ ఫంగస్‌కు అరుదైన సర్జరీ.. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల ఘనత
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ దవాఖానలో బ్లాక్ ఫంగస్ కు అరుదైన చికిత్స చేసి ఘనత సాధించారు వైద్యులు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో బ్లాక్ ఫంగస్ చికిత్స విజయవంతమైందని జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరిటెండెంట్ ప్రతిమ రాజ్ అన్నారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ దవాఖాన సూపరిటెండెంట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. నిజాంబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన శ్యామ్ రావు గత కొంత కాలంగా బ్లాక్ ఫంగస్ తో ఇబ్బందులు పడుతూ ఈ నెల 30న ప్రభుత్వ దవాఖానలో చేరారన్నారు. ఆయనకు ఆదివారం మందులు ఇచ్చి సోమవారం సర్జరీ చేయడం జరిగిందని, ఈ సర్జరీ వైద్యుల సమష్టి కృషితో విజయవంతమైందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో బ్లాక్ ఫంగస్ అరికట్టేందుకు వైద్యులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు 70 లక్షల పరికరాలను అందించడం జరిగిందన్నారు. జిల్లాకు ఎనిమిది లక్షల మందులను అందించడం జరిగిందన్నారు. దీనికి సహకరించిన జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,డియంఇ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ల సహకారంతో బ్లాక్ ఫంగస్ పై విజయం సాధించామని అన్నారు.