- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేరబుల్ సెన్సార్‌తో ‘డ్రగ్ డిటెక్షన్’
దిశ, ఫీచర్స్: ‘డ్రగ్స్’ తీసుకున్నారో లేదో తెలియాలంటే.. సాధారణంగా యూరిన్ టెస్ట్ చేస్తారు. బ్లడ్, హెయిర్‌తో పాటు మన లాలాజలం, స్వేదంలోనూ ‘డ్రగ్స్’ ఆనవాళ్లు ఉంటాయి. అయితే వీటన్నింటిని మన శరీరం నుంచి సేకరించి లిక్విడ్ క్రోమటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీ ద్వారా విశ్లేషించిన తర్వాతే ఫలితం వెల్లడవుతుంది. ఈ ప్రాసెస్‌కు కొంత టైమ్ పడుతుంది. ‘రాపిడ్ టెస్ట్ కిట్స్’ ద్వారా యూరిన్‌లో మాదకద్రవ్యాల అవశేషాలను గుర్తించగలిగినప్పటికీ, ఇది ఒకే భాగానికి పరిమితమవుతుంది. ఈ క్రమంలోనే.. వేగంగా డ్రగ్ డిటెక్ట్ చేసే ‘వేరబుల్ సెన్సార్’ను కొరియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ సైన్స్ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
‘టెక్నాలజీ’ని సరిగ్గా వినియోగించుకుంటే అద్భుతాలు చేయొచ్చన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నానో మెటీరియల్ టెక్నాలజీని ఉపయోగించి, జస్ట్ ఓ చిన్న ప్యాచ్ ద్వారా నార్కోటిక్స్ తీసుకున్నామో లేదో ఒకే ఒక్క నిమిషంలో తెలిసిపోయే వేరబుల్ సెన్సార్‌ను కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిలో మూత్ర పరీక్షల మాదిరి, ప్రక్రియనంతా గమనించడానికి నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణుడి అవసరం కూడా లేదు. తక్కువ మొత్తంలో పదార్థాలు మాత్రమే చెమటలో విడుదలవుతాయి, కాబట్టి మెరుగైన గుర్తింపు కోసం హైలీ సెన్సిటివ్ సెన్సార్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. డాక్టర్ హో సాంగ్ జంగ్ నేతృత్వంలో, కొరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ సైన్స్ (కిమ్స్) బృందం ఈ పరిశోధనను నిర్వహించింది. డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్, దుర్వినియోగం వంటి సామాజిక సమస్యలను పరిష్కరించడంలో ఈ టెక్నాలజీ సహాయపడుతుందని, అలాగే అథ్లెట్లు తీసుకున్న నిషేధిత పదార్థాలను గుర్తించగలదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ ప్యాచెస్ ఒక్కొక్కటి కేవలం 50పీ (బ్రిటిష్ పౌండ్ స్టిర్లింగ్) కన్నా తక్కువ ఖర్చు అవుతుందని సైంటిస్టుల బృందం వెల్లడించింది.