దారుణం: తమ్ముడి కూతురిపై అత్యాచారం..!

by Sumithra |   ( Updated:2020-09-09 11:47:16.0  )
దారుణం: తమ్ముడి కూతురిపై అత్యాచారం..!
X

దిశ వెబ్‎డెస్క్:

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా అఘాయిత్యాలు ఆగడం లేదు. ముక్కు పచ్చలారని చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎవరిని వదలడం లేదు కామాంధులు. పలు చోట్ల కంటిపాపలా కాపాడాల్సిన కుటుంబ సభ్యులే లైంగిక దాడికి పాల్పడుతున్నారు.

తాజాగా కామంతో కళ్లు మూసుకుపోయి తమ్ముడి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన హైదరాబాద్‎లోని పేట్ బషీరాబాద్‎లో చోటు చేసుకుంది. బషీరాబాద్‎లో డాక్టరుగా సేవలందిస్తున్న ఓ వ్యక్తి.. తన తమ్ముడి కూతురిపై కన్నేశాడు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఇంటికి రాగా బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తన పెదనాన్నే అత్యాచారానికి పాల్పడడంతో కొన్ని రోజుల పాటు బాధపడిన యువతి షీటీమ్స్‎కు ఫిర్యాదు చేసింది. తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్‎ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed