- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలికపై అత్యాచారం.. స్పందించిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్
దిశ, ఏపీ బ్యూరో: కడప జిల్లాలో తొమ్మిదేళ్ల బాలికపై మైనర్ అత్యాచార ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో ఆమె మాట్లాడారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే బాధితురాలి తల్లిదండ్రులతోనూ వాసిరెడ్డి పద్మ ఫోన్‌లో మాట్లాడారు. బాలిక తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాలతో మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జెల లక్ష్మీ బాధిత బాలికను పరామర్శించారు. ఇకపోతే చక్రాయపేటలో గురువారం దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఓ మైనర్ యువకుడు తొమ్మిదేళ్ల బాలికను అత్యాచారం చేశాడు. బాలిక చనిపోయిన మేకపిల్లను పడేసేందుకు కంప చెట్ల వద్దకు వెళ్లగా అక్కడ కాపుకాసి ఉన్న ఆ యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక కదలలేని స్థితిలో ఉండిపోయింది. బాలిక ఎంత సేపటికీ రాకపోవడంతో ఆ చిన్నారి మేనత్త వెళ్లి చూడగా.. ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాలిక తనపై జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి న్యాయం చేయాలంటూ చక్రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.