- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రితో ఫ్రెండిషిప్.. మూగ కూతురిపై అత్యాచారయత్నం
దిశ, ఇల్లందు : మానవత్వం మసకబారుతోంది. కామాంధుల క్రూరత్వానికి సాధారణ మహిళలతో పాటు దివ్యాంగులు సైతం నరకయాతన అనుభవిస్తున్నారు. ఓ మూగ యువతి (26) పై జరిగిన అత్యాచారయత్నంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకివెళితే.. పట్టణంలోని కాకతీయ నగర్‌కు చెందిన ఓ యువతి పుట్టుకతోనే మూగ, మతిస్థిమితం సరిగా లేదు. దీంతో ఇంట్లోనే ఉంటోంది.టేకులపల్లి మండలానికి చెందిన జి.మోతిలాల్ (35) ఉదయం ఈ యువతి ఇంటికి వెళ్లాడు. ఈమె తండ్రితో మాట్లాడి యువతి పరిస్థితిపై ఆరా తీశాడు.
ఆ తర్వాత మండలంలోని రాఘబోయినగూడెం రహదారి వైపు యువతిని తీసుకెళ్ళి అత్యాచారయత్నం చేశాడు. ఇది గుర్తించిన కొందరు ఆమె అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే ఆమె సోదరుడు 100కు ఫోన్ చేసి… తన తండ్రితోపాటు స్నేహితులను తీసుకెళ్లి రాఘబోయినగూడెం రహదారిలో వెదకగా వారిద్దరు దొరికారు. మద్యం మత్తులో ఉన్న కామాంధుడిని స్థానికులు, పోలీసుల సహకారంతో స్టేషనుకు తీసుకొచ్చారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించామని ఎస్ఐ కుమారస్వామి తెలిపారు.