- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్రైజ్‌మనీ ఎప్పుడు చెల్లిస్తారు?
దిశ, స్పోర్ట్స్: దేశవాళీ క్రికెట్‌లో రంజీకి ఉండే ప్రాధాన్యతే వేరు. ఇప్పుడంటే ఐపీఎల్ వచ్చి రంజీకి కాస్త ఆదరణ తగ్గింది. కానీ, యువ క్రికెటర్లు జాతీయ జట్టులో స్థానం సంపాదించాలంటే రంజీలే మార్గం. పశ్చిమబెంగాల్ జట్టు గత సీజన్‌లో అద్భుతమైన ఫామ్ కనబర్చి కాస్తలో ట్రోఫీ చేజార్చుకుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.కోటి ప్రైజ్ మనీ దక్కాలి. నెలలు గడుస్తున్నా బీసీసీఐ మాత్రం ఇంతవరకు రూ.కోటి ఊసే ఎత్తడం లేదు.
కొన్ని రోజులుగా ఆటగాళ్లలో మానసిక స్థైర్యం నింపడానికి, భవిష్యత్ ప్రణాళికలు వివరించడానికి కోచ్ అరుణ్ లాల్ ఆటగాళ్లందరితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ‘వెబ్‌నియర్’లో ఒక సీనియర్ క్రికెటర్ రూ.కోటి ప్రైజ్ మనీ గురించి ప్రశ్నించాడు. ఆటగాళ్లకు బీసీసీఐ ఇచ్చే వేతనాలు, ప్రైజ్ మనీనే జీవనాధారమని, నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో అరుణ్ లాల్ ఈ విషయాన్ని క్యాబ్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియాకు చెప్పాడు. ‘కరోనా సంక్షోభం కారణంగా బీసీసీఐ చాలా కొద్ది మంది ఉద్యోగులతో పనులు చేయించుకుంటుందని, సిబ్బంది కొరత కారణంగా చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నదని, ఒకటి లేదా రెండు రోజుల్లో బీసీసీఐ ఆ ప్రైజ్ మనీ చెల్లిస్తామని మాటిచ్చింది’ అని ఆయన అన్నారు. కాగా, 2015-16 సీజన్‌కు చెల్లించాల్సిన స్పాన్సర్‌షిప్ డబ్బులు కొన్ని రోజుల క్రితం చెల్లించడం గమనార్హం.