- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీపికతో విడిపోయేందుకు కారణం అమ్మ కాదు: రణ్ బీర్
దీపికా పదుకొనె…. అందం, అభినయం కలగలసిన ముద్దుగుమ్మ. కళ్లలో హావభావాలు చూపగల ఆమె… నవ్వుతో కుర్రకారును పడేస్తుంది. కానీ రియల్ లైఫ్ లో తొలిసారి తనను ప్రేమలో పడేసింది మాత్రం రణ్ బీర్ కపూర్. వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు పోతుంది అనుకున్నా… ఇద్దరూ విడిపోయారు. ఆ సమయంలో దీపికా మానసిక ఒత్తిడికి గురైంది కూడా. కానీ ఆ ఒత్తిడి నుంచి బయటకు వచ్చి రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకుని సెట్ అయిపోయింది. కానీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చేసిన మోసం గురించి సమయం వచ్చిన ప్రతీసారీ చెప్తూనే ఉంటుంది… విమర్శిస్తునే ఉంటుంది దీపికా.
అయితే దీపిక, రణ్ బీర్ విడిపోయేందుకు కారణం రణ్ బీర్ తల్లి అని రూమర్స్ వస్తుండగా… దీనిపై క్లారిటీ ఇచ్చారు ఆయన. మా అమ్మకు నేనన్నా, దీపిక అన్నా చాలా ఇష్టమని… తనెందుకిలా చేస్తుందని ప్రశ్నించాడు. లవ్ లో బ్రేక్ అప్ కు మా మధ్య వ్యక్తిగత కారణాలు ఉన్నాయని చెప్పాడు. అయినా తను నన్ను అర్ధం చేసుకుంటుందని… ఇప్పటికీ మేమిద్దరం మంచి మిత్రులుగా ఉన్నామని చెప్పాడు.
అయితే ముందుగా సోనమ్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన రణ్ బీర్… తర్వాత కత్రినా కైఫ్, దీపికా పదుకొనెతో ప్రేమాయణం నడిపాడు. ప్రజెంట్ అలియా భట్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడు రణ్ బీర్. డిసెంబర్ లో వీరిద్దరి పెళ్లి ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
Tags: Ranbir Kapoor, Deepika Padukone, Love, Ranbir Singh, Bollywood