ఆన్సర్ ‘వై ఆర్ యూ’? : రానా

by Shyam |
ఆన్సర్ ‘వై ఆర్ యూ’? : రానా
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రయోగాలు చేయడంలో, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకోవడంలో టాలీవుడ్ హంక్ రానా ఎప్పుడూ ముందుంటాడనే విషయం తెలిసిందే. బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ బుల్లితెరపై కార్యక్రమాలు చేయడానికి రానా వెనుకాడడు. ఈ క్రమంలోనే ‘విరాట పర్వం, అరణ్య’ సినిమాలతో పాటు డిస్కవరీ అందిస్తున్న ‘మిషన్ ఫ్రంట్‌లైన్‌’లోనూ మన భల్లాల దేవుడు సోల్జర్‌గా కనిపించబోతున్నాడు. ఇంత బిజీలో కూడా యానిమేషన్ సిరీస్ ‘వై ఆర్ యూ’తో మరో ప్రయోగానికి సిద్ధపడ్డాడు. ఇందులో భాగంగానే ఆడియన్స్‌కు అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నాడు రానా.

‘వై ఆర్ యూ’ యానిమేషన్ సిరీస్‌లో భాగంగా ప్రముఖులను ఇంటర్వ్యూ చేసే రానా.. సామాన్యులకు కూడా ఆ అవకాశం ఇవ్వబోతున్నాడు. మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ప్రమోషన్ మొదలెట్టిన ఈ దగ్గుబాటి హీరో.. ‘వై ఆర్ యూ కాంటెస్ట్ అలర్ట్’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. వై ఆర్ యూ (నువ్వే ఎందుకు) అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ నిమిషంలోపు ఓ వీడియో రూపొందించి, ఆ వీడియోను వైఆర్‌యూ హ్యాష్‌ట్యాగ్‌తో పాటు సౌత్‌బేలైవ్ (@SouthBayLive), బిగ్‌బ్యాంగ్‌సోషల్ (@BigBangSocl)కు ట్యాగ్ చేయాలని రానా తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ కాంటెస్ట్‌లో గెలుపొందిన విజేతను తనే స్వయంగా ఇంటర్వ్యూ చేయనున్నట్లు వెల్లడించాడు.

Advertisement

Next Story