హాట్ న్యూస్.. సమంత ఆ నిర్ణయం తీసుకోవడానికి ‘రానా’నే కారణమా ?

by Anukaran |   ( Updated:2021-12-01 02:07:04.0  )
హాట్ న్యూస్.. సమంత ఆ నిర్ణయం తీసుకోవడానికి ‘రానా’నే కారణమా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో చాలా మంది ఫేవరెట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది సమంతనే. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది సామ్. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత ఎన్నో సినిమాలు చేసి తన నటనతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. అనంతరం అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత వీరి మధ్య ఏమైందో తెలియదు కానీ వీరు విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి తమ అభిమానులకు షాక్ ఇచ్చారు. దీని తర్వాత సమంత, చైతన్య వారి కెరియర్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సమంత వరస సినిమాలతో చాలా బిజీ అయిపోయింది.

విడాకుల ప్రకటన అనంతరం ఆ బాధ నుంచి బయటపడటానికి సామ్ తమ స్నేహితులతో తీర్థయాత్రలు చేస్తూ ఏంజాయ్ చేసింది. అలాగే సినిమాలపై కూడా ఫోకస్ పెట్టింది. ఇక తాజగా ఓ ఇంటర్నేషనల్ సినిమాకు కూడా సమంత సంతకం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆఫర్ సమంతకు రావడం కారణం దగ్గుబాటి వారసుడు రానానే అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. భారతీయ రచయిత ఎన్. మురారి రాసిన పుస్తక నవల ఆధారంగా తెరకెక్కుతున్న “అరేంజ్‌‌మెంట్స్ ఆఫ్ లవ్” సినిమాలో సమంత బై-సెక్సువల్‌ తమిళ అమ్మాయిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప‌ర్టికుల‌ర్‌గా బై సెక్సువ‌ల్ రోల్‌లో ఎవరు నటిస్తే బాగుంటుంది అని సినీ మేక‌ర్స్ ఆలోచిస్తుండ‌గా, రానా స‌మంత అయితే బాగుంటుందని తెలిపారని టాక్ ఇలా సమంతకు అంతర్జాతీయ సినిమాలో అవకాశం వచ్చింది. ఇలా సమంత ఎంతో ఆనందంగా తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌పై సైన్ చేసి ఆ శుభవార్తను సోషల్ మీడియావేదికగా తన అభిమానులతో పంచకున్న విషయం తెలిసిందే.

Read more : విడాకుల తర్వాత సమంతను వెనకుండి నడిపిస్తున్న తల్లి

ఆర్‌సీ15 రిలీజ్ అక్కడే.. క్లారిటీ ఇచ్చిన చెర్రీ..

Advertisement

Next Story