కొండా మురళికి తనదైన స్టైల్లో ‘బర్త్ డే’ విషెస్ చెప్పిన ఆర్జీవీ..!

by Shyam |   ( Updated:2021-10-23 04:56:27.0  )
కొండా మురళికి తనదైన స్టైల్లో ‘బర్త్ డే’ విషెస్ చెప్పిన ఆర్జీవీ..!
X

దిశ, వెబ్‌డెస్క్ : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలీదు. ఎప్పుడూ ఏదో ఒకటి చేసి వార్తల్లో నిలవడం ఆయన మ్యానరిజం. ఈయన చేష్టలకు కొందరు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వారంతా రాముఇజం పేరుతో అచ్చం రామ్ గోపాల్ వర్మలానే లైఫ్ లీడ్ చేసేందుకు ప్రయత్ని్స్తున్నారు. ఈయన సినిమాలకు ప్రత్యేకంగా ప్రమోషన్స్‌తో పనిలేదు. ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఫుల్ హైప్ తీసుకొస్తాడు. పొలిటికల్, సినిమాల పరంగా బాగా పలుకుబడి ఉన్న వ్యక్తుల మీద కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు.

https://twitter.com/RGVzoomin/status/1451815946411130884?s=20

అయితే, వర్మకు బర్త్ డేలు, సెలబ్రేషన్స్ అంటే పెద్దగా నచ్చవు. తన పుట్టిన రోజున ఎవరైనా విషెస్ చెబితే ఈ రోజు నా బర్త్ డే కాదు డెత్ డే.. ఎందుకంటే నా జీవితంలో మరో సంవత్సరం ఈ రోజుతో పోయిందని రిప్లై ఇచ్చి అభిమానులను షాక్‌కు గురిచేస్తుంటాడు. తన సినిమాల్లో ఎప్పుడు హింస, రక్తపాతం, క్రైం బేస్డ్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకునే వర్మ.. తనదైన స్టైల్లో ” కొండా మురళి గారికి.. కొండా చిత్ర యూనిట్, నల్ల బల్లి సుధాకర్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు” తెలిపారు. మీకు పుట్టినరోజు విషెస్, సెలబ్రేషన్స్ అంటే నచ్చదుగా అని ఎవరైనా అడుగుతారేమో అని ముందే ఊహించిన వర్మ.. చిత్ర యూనిట్ తరఫున శుభాకాంక్షలు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా శాంతికి చిహ్నం అంటూ కొండా మురళీ ఫోటోను పోస్టు చేశారు.. కాగా, తెలంగాణ రక్తచరిత్రగా ఎన్‌కౌంటర్‌లో హతమైన నక్సలైట్ ఆర్.కె అలియాస్ రామకృష్ణకు, కొండా మురళికి మధ్య యధార్ధ ఘటనల ఆధారంగా ‘కొండా’ సినిమాను వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed