- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తండ్రీ కొడుకులకు షాక్ : సీక్రెట్ చెప్పిన రమేష్
విశాఖ, ఎలమంచిలి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శుక్రవారం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ ఎందుకు వీడాల్సొచ్చిందో చెప్పారు. చంద్రబాబు, లోకేష్ లపై సంచలన విమర్శలు చేశారు.
ఆయన ఏమన్నారంటే…
ఈ రోజు నా జీవితంలో ఓ సుదినం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో నేను వైస్సార్సీపీలో జాయిన్ అయ్యాను. 5 నెలల క్రితం జిల్లా అధ్యక్ష పదవికి, టీడీపీకి రాజీనామా చేశాను. వైఎస్సార్సీపీకి ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చారు.
ప్రజలకు నేనున్నానని విపత్తుల సమయంలో జగన్ ఆదుకున్నారు. అట్టడుగు వర్గాలకు 60 వేల కోట్లు ఖర్చు చేశారు ప్రజలంతా బ్రహ్మ రథం పడుతుంటే ఆయనకు మద్దతు పలకకుండా ప్రతిరోజూ జగన్ ని తిట్టమనడం తట్టుకోలేక బయటకు వచ్చాం. ఇంకా చాలా మంది వైఎస్సార్సీపీ పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ఉత్తరాంధ్రను పరిపాలన రాజధాని చేస్తాను అంటే వ్యతిరేకించాడు. మూడు రాజధానులు వద్దని ఆందోళన చేయాల్సిందిగా మెసేజ్ పెడుతున్నారు. చివరకు విశాఖలో ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టాలన్నా కోర్ట్ కేసులతో అడ్డుకుంటున్నారు. మా ప్రాంతానికి వ్యతిరేకంగా మసులుకోలేక టీడీపీని వీడాం.
చంద్రబాబు జూమ్ అని మీటింగ్ పెట్టి విమర్శలకు దిగుతుంటే చాలా మంది నాయకులు దాంట్లోకి రావడం లేదు. ఎందుకు ఒడిపోయామని పోస్ట్ మార్టం చేసుకోకుండా చెప్పుడు మాటలు వింటూనే ఉన్నాడు చంద్రబాబు. ఇక ఆ పార్టీ బాగుపడే పరిస్థితి లేదు అని రమేష్ బాబు వ్యాఖ్యానించారు.
లోకేష్ నాయకత్వం వద్దని చెప్పాము. పార్టీలో సీక్రెట్ ఓటింగ్ పెడితే 10 శాతం కూడా ఆయనకి మద్దతు పలకరు. దేశంలో అందరూ మెచ్చుకునే విధంగా ముఖ్యమంత్రి చేస్తున్న పరిపాలనకు వారి బాటలో నడవాలని వైసీపీలో చేరాం.
మన ప్రాంతానికి మంచిరోజులు వచ్చాయి. కుళ్ళు కుతంత్రంతో నాటకాలు ఆడుతున్న చంద్రబాబు, ఆయన కొడుకుని నమ్మొద్దని ఉత్తరాంధ్ర ప్రజలను కోరుతున్నాను. ఎప్పటిలానే తన నిర్ణయాన్ని అంగీకరించి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు రమేష్ బాబు.