- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అయోధ్య భూమిపూజ ఆపాలని దాఖలైన పిటిషన్ కొట్టివేత..
దిశ, వెబ్‌డెస్క్ :
అయోధ్య రామ జన్మభూమిలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమాన్ని నిలిపేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త సాకేత్ గోఖలే ఈ పిల్ దాఖలు చేశారు.
ఆలయ నిర్మాణానికి ఆగస్టు 5న భూమి పూజ జరుగనుంది. దీనికి ప్రధాని మోడీతో పాటు దాదాపు 300 మందికి ఆహ్వానం అందింది.
సాకేత్ గోఖలే దాఖలు చేసిన పిటిషన్‌లో.. కొవిడ్ మహమ్మారి దేశాన్ని పట్టి పీడీస్తోందని కోర్టుకు వివరించారు. కేంద్రం ఈ వైరస్‌ను నిరోధించేందుకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ, శంకుస్థాపనలను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని అలహాబాద్ హైకోర్టును కోరారు.
ఒకేచోట 300 మంది కలిస్తే వైరస్ వ్యాప్తి చెందుతుందని ఈ మేరకు కోర్టు ఆలోచన చేయాలని వాదించారు. పిటిషనర్ వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. కేవలం ఊహల ఆధారంగా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారని వ్యాఖ్యానించింది. మీరు అనుకున్నట్లు నిబంధనల ఉల్లంఘన జరుగుతుందనే భయాలకు సరైన ఆధారాలేవీ లేవని తెలిపింది. అయితే, కార్యక్రమంలో నిర్వాహకులు, ప్రభుత్వాలు భౌతిక దూరానికి సంబంధించిన నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకుంటాయని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు తగిన కారణం ఉన్నట్లు తాము భావించడం లేదంటునే పిటిషన్‌ను తోసిపుచ్చింది.