- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళిత నాయకుడిపై దాడి యత్నం సిగ్గు చేటు: రామ సహాయం మాధవి రెడ్డి
దిశ, పాలేరు: కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కోసం వస్తున్న కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కని.. పాలేరు ఎమ్మెల్యే కందాల అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచేటని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షురాలు రామ సహాయం మాధవి రెడ్డి అన్నారు. శనివారం కూసుమంచి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పాలేరు ఎమ్మెల్యే కందాలపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. పార్టీ నుండి గెలిచిన నువ్వు నీ వ్యాపారులు కాపాడుకోవడానికి పార్టీ మారి, ప్రజలను అడ్డంగా మోసం చేసిన విషయాన్ని మల్లు భట్టి విక్రమార్క విమర్శిస్తే ఎందుకు తట్టుకోలేక పోతున్నావని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి అటు కార్యకర్తలను మోసం చేసిన దానిపై మాట్లాడితే సీఎల్పీ లీడర్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తారా? ఇక మీ ఆటలు సాగవు నియోజకవర్గంలో మీ నిజస్వరూపం అంత తెలిసిపోయింది! ఇకనైనా జాగ్రత్తగా నడుచుకో లేదా నియోజకవర్గంలో తిరగలేవు అంటూ ఘాటుగా విమర్శించారు. ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతారన్నారు. నిజంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారితే, ఈ మూడేళ్లలో జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని.. లేదా తప్పు ఒప్పుకొని నియోజకవర్గ ప్రజలకు బేషరతుగా క్షేమాపన చెప్పాలని డిమాండ్ రామ సహాయం మాధవరెడ్డి చేశారు.