బాలీవుడ్‌లో రామ్-లక్ష్మణ్‌ ‘యాక్షన్’

by Jakkula Samataha |
బాలీవుడ్‌లో రామ్-లక్ష్మణ్‌ ‘యాక్షన్’
X

బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ బాగి-3 ట్రైలర్‌తో అదరగొట్టేశాడు. అన్నదమ్ముల మధ్య అనుబంధం, కిడ్నాప్ అయిన అన్నను వెతికేందుకు తమ్ముడు పడే కష్టం సినిమా స్టోరీ కాగా, ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కిరాక్‌గా ఉన్నాయి. శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమా గురించి తెలుగు సినీ అభిమానులు గర్వపడే విషయం ఒకటుంది. అదే రామ్-లక్ష్మణ్ మాస్టర్స్. తెలుగు, తమిళ సినిమాల్లో హీరోలకు ఫెవరేట్‌గా మారిన వారు ఈసారి బాలీవుడ్‌లో దుమ్ము దులిపారు. బాగి-3 యాక్షన్ సీక్వెన్స్‌లో తమ మార్కును చూపించారు. కిచ్చా మాస్టర్‌తో కలిసి రూపొందించిన యాక్షన్ ఘట్టాలు, స్టంట్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. ఫుల్ యాక్షన్ డోస్ ఉన్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇలాంటి సినిమాతో రామ్- లక్ష్మణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం, మొదటి సినిమాతోనే అదిరిపోయే రెస్పాన్స్ అందుకోవడం టాలీవుడ్‌కు గర్వకారణం. అంతేకాదు సంక్రాంతికి వచ్చిన దర్బార్, సరిలేరు నీకెవ్వరు చిత్రాలకు రామ్-లక్ష్మణ్ డైరెక్ట్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయ్.

Advertisement

Next Story