‘మర్డర్ మూవీ’ నిలిపివేతపై హైకోర్టుకు ఆర్జీవీ..

by Anukaran |   ( Updated:2020-08-25 10:07:26.0  )
‘మర్డర్ మూవీ’ నిలిపివేతపై హైకోర్టుకు ఆర్జీవీ..
X

దిశ, వెబ్‌డెస్క్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘మర్డర్’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ తీర్పును సవాలు చేస్తూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు.

దీనిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ మూవీ నిలిపివేతకు సంబంధించి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణ పై ఎలాంటి చర్యలు చేపట్టరాదని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలాఉండగా, మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకోగా, ఈ చిత్రం విడుదలపై ప్రణయ్ తల్లిదండ్రులు, అతని భార్య అమృత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story