- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్ఆర్ఆర్ టీమ్‌కు గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరిన చెర్రీ
దిశ, వెబ్‌డెస్క్: గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ చాలెంజ్‌లో టాలీవుడ్ సెలెబ్రిటీలు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా బాహుబలి ప్రభాస్ విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన రాంచరణ్.. తన నివాసంలో ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు.
‘ప్రభాస్ ఇచ్చిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను. నా వంతు బాధ్యతగా 3 మొక్కల్ని నాటాను. ఈ సందర్భంగా హీరోయిన్ ఆలియా భట్, దర్శకుడు రాజమౌళితో పాటు ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ మొత్తాన్ని గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నాను. వారందరూ చాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలు నాటాలి. నా అభిమానులు కూడా ఈ పనిలో భాగస్వాములై ఈ చైన్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు నా కృతజ్ఞతలు’ అని రాంచరణ్ ట్వీట్ చేశారు. దీనికి జతగా ఆయన మొక్కలు నాటిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.
I've accepted #HaraHaiTohBharaHai #GreenindiaChallenge
from #Prabhas and planted 3 saplings. Further I am nominating @ssrajamouli, @aliaa08, entire my #RRRMovie team and all my fans
to plant 3 trees & continue the chain. Special thanks to @MPsantoshtrs for taking this initiate. pic.twitter.com/oQpl42PA3i— Ram Charan (@AlwaysRamCharan) November 8, 2020