- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఆచార్య'లో చరణ్ రోల్ కన్‌ఫాం : చిరు
దిశ, వెబ్‌డెస్క్: మెగా అభిమానులకు శుభవార్త చెప్పాడు మెగా స్టార్ చిరు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘ఆచార్య’ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించబోతున్నట్లు స్పష్టం చేశాడు. తొలి నుంచే ఈ సినిమాలో చరణ్ కీలక పాత్రలో నటిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే చెర్రీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉండడంతో చిరుతో కలిసి పని చేస్తాడా? లేదా? అన్న సందేహంలో పడిపోయారు ఫ్యాన్స్. పైగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి అంతకు ముందుగా సెట్ చేసిన రిలీజ్ డేట్.. జనవరి 8కి పోస్ట్ పోన్ కావడంతో ఇక కష్టమే అనుకున్నారు. అయితే ఈ విషయంపై దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో మాట్లాడిన చిరు.. నెల రోజుల పాటు చెర్రీ డేట్స్ కావాలని కోరారట. దీనికి జక్కన్న గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో .. ఆచార్య సినిమాలో చెర్రీ నటించడం కన్‌ఫాం అయిపోయింది. చరణ్, నేను కలిసి నటించాలనేది సురేఖ కోరిక అని…. డైరెక్టర్ కొరటాల శివ కూడా అదే కోరుకున్నారని తెలిపాడు. కాగా సినిమాలో గురు శిష్యులుగా చిరు, చెర్రీ కనిపిస్తున్నారన్న వార్తతో మెగా ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
అంతేకాదు ఈ సినిమాలో మెగా డాటర్ నిహారిక కూడా నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే ‘సైరా’ లో పెద్దనాన్న సినిమాలో చిన్న పాత్ర చేసిన నిహారిక… ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తుందని ప్రచారం జరుగుతుంది. ‘ఆచార్య’లో మెగా డాటర్ ఎంట్రీ ఇస్తుందనే వార్తతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
Tags: Chiranjeevi, Ram Charan Tej, Niharika, Acharya, Koratala Siva