కన్నడ ఇండస్ట్రీ గ్రేట్: రక్షిత్‌శెట్టి

by Jakkula Samataha |
కన్నడ ఇండస్ట్రీ గ్రేట్: రక్షిత్‌శెట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రాంతీయతత్వం ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. మన భాష మీద మనకు అభిమానం ఎక్కువే. సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే అలాంటి అభిమానం ఓ రేంజ్‌లో ఉంటుంది. తమ పరిశ్రమ గొప్పదనం గురించి మాట్లాడడంలో సినీ లవర్స్ ముందుంటారు. అభిమానుల వరకే ఆ ఎఫెక్ట్ ఉంటుందని తెలుసు కానీ.. హీరోలూ అలాంటి అభిమానాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తారని కన్నడ హీరో రక్షిత్ శెట్టి హ్యాపీనెస్ చూస్తే అర్థం అవుతుంది.

విషయం ఏంటంటే కేజీఎఫ్ ఫిల్మ్ మేకర్స్ హోంబలి ఫిల్మ్స్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ చేసింది. యాక్షన్ సాగా ‘సలార్‌’లో మోస్ట్ వయొలెంట్‌గా కనిపించబోతున్న ప్రభాస్ లుక్ ఇంటర్నేషనల్ లెవల్‌లో బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేసిన రక్షిత్ శెట్టి..కన్నడ ప్రొడక్షన్ హౌజ్ తెలుగు ఇండస్ట్రీకి చెందిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా చేయడం, కన్నడ డైరెక్టర్‌ను ప్రభాస్ సంప్రదించడాన్ని తమ ఇండస్ట్రీ ఇచ్చే బెస్ట్ కంటెంట్‌కు ఎగ్జాంపుల్ అని మురిసిపోయాడు.

ఇది కన్నడ ప్రజలకు గర్వకారణం అని.. మన స్టూడియోలు దేశ వ్యాప్తంగా కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేయడం.. మన సాంకేతిక నిపుణులను ఇతర పరిశ్రమలు కోరుకోవడం.. ఆనందించదగిన విషయమన్నాడు. దేశం మొత్తం తమ ఇండస్ట్రీ వైపు చూస్తుందనే..ఇలాంటి రోజు వస్తుందని నమ్మాను అని .. ఆ సందర్భం వచ్చేసిందన్నారు రక్షిత్ శెట్టి. ప్రభాస్‌తో న్యూ జర్నీ స్టార్ట్ చేసిన హోంబలి ఫిల్మ్స్ బ్యానర్‌‌కు కంగ్రాట్స్ చెప్పారు.

Advertisement

Next Story