- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఎస్ఎఫ్ చీఫ్‌గా రాకేష్ అస్తానా
న్యూఢిల్లీ: ఐపీఎస్ అధికారి రాకేష్ అస్తానాను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) చీఫ్‌గా కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఆయన సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఆయన బీఎస్‌ఎఫ్ చీఫ్‌గా కొనసాగనున్నారు. సీబీఐ అంతర్గత కలహాల్లో భాగంగా అప్పటి చీఫ్ అలోక్ వర్మ, అప్పడు స్పెషల్ డైరెక్టర్‌గా ఉన్న రాకేష్ అస్తానాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే.
రాకేష్ అస్తానాపై వచ్చిన తీవ్ర ఆరోపణలన్నింటికీ సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. వచ్చే ఏడాది జులై 31వరకు అస్తానా బీఎస్ఎఫ్ చీఫ్‌గా కొనసాగనున్నారు. ఇప్పటి వరకు ఐటీబీపీ డీజీ ఎస్ఎస్ దేస్వాల్ బీఎస్ఎఫ్ చీఫ్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. అస్తానాతోపాటు పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బ్యూరో చీఫ్ వీఎస్‌కే కౌముదిని హోం శాఖలోని అంతర్గత భద్రతకు ప్రత్యేక కార్యదర్శికి కేంద్రం నియమించింది. సీఆర్‌పీఎఫ్ (CRPF) ప్రత్యేక డీజీగా పనిచేస్తున్న జావెద్ అఖ్తర్‌ను ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్, హోంగార్డు డీజీగా అపాయింట్ చేసింది.