‘మాజీ సైనికుల పై దాడి బాధాకరం’

by Shamantha N |
‘మాజీ సైనికుల పై దాడి బాధాకరం’
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సైనికుల పై దాడి చేయడం పూర్తిగా అమోదయోగ్యం కాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ముంబై‌లో మాజీ నావికాదళ అధికారి మదన్ శర్మ పై శివసేన కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై స్పందించిన రాజ్ నాథ్ ఓ ట్వీట్ చేశారు. ‘శివసేన కార్యకర్తలు దాడి చేసిన మాజీ నావికాదళ అధికారి మదన్ శర్మతో మాట్లాడాను. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం పై ఆరా తీశాను. అయినా.. మాజీ సైనికుల పై దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదు. ఈ ఘటన బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Advertisement

Next Story