- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ట్విట్టర్‌లో ‘తలైవా’ పొలిటికల్ తుఫాన్
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇష్యూ సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టిస్తోంది. కొన్నేళ్లుగా తన ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్.. ఈ విషయంపై సోమవారం క్లారిటీ వచ్చే చాన్స్ ఉండటంతో పండగ చేసుకుంటున్నారు. రజినీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తనతో పాటు నిలబడతామన్న అభిమానులు ట్విట్టర్‌లో ట్రెండ్‌కు తెరలేపారు. #RajinikanthPoliticalEntry హ్యాష్ ట్యాగ్‌తో రజినీ రాజకీయ ప్రవేశంపై ట్రెండ్ సృష్టించారు.
తలైవా నవంబర్ 30న అభిమానులతో మీటింగ్ ఉంటుందని చేసిన అనౌన్స్‌మెంట్ మరోసారి తన పొలిటికల్ ఎంట్రీపై ఎగ్జైట్‌మెంట్‌ను పెంచింది. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండటంతో చెన్నై రాఘవేంద్ర కళ్యాణ మండపంలోని రజినీ మక్కల్ మండ్రం ఆఫీస్‌లో అభిమాన సంఘాలతో మీటింగ్ ప్లాన్ చేశాడు. ఈ సమావేశంతో రజినీ రాజకీయ ప్రవేశంపై స్పష్టత రానుండగా.. తమ రోల్ మోడల్, ఇన్‌స్పిరేషన్ ఐకాన్‌కు వీర లెవల్‌లో వెల్‌కమ్ చెప్పేందుకు వెయిట్ చేస్తున్నారు. నవంబర్ 30 తమిళనాడు అండ్ ఇండియన్ పాలిటిక్స్‌కు బిగ్ డే అవుతుందంటున్న ఫ్యాన్స్.. పాలిటిక్స్ ఎప్పటికీ ఒకేలా ఉండవు అంటున్నారు. రజినీ ఎంట్రీతో వచ్చే చేంజ్‌కు విట్‌నెస్‌గా ఉండేందుకు రెడీ అయిపోమని చెప్తున్నారు. ఈ ఇన్సిడెంట్‌ను గేమ్ ఆఫ్ థ్రోన్స్‌తో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/mujahid96327777/status/1332906522007900161?s=20