తలైవా@2020 ట్రెండింగ్స్

by Anukaran |   ( Updated:2020-12-12 02:30:19.0  )
తలైవా@2020 ట్రెండింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : సూపర్‌స్టార్ రజినీకాంత్.. తన జీవితం మొత్తం అభిమానులను అలరించేందుకే అంకితం చేశారు. తనదైన స్టైల్, స్వాగ్, యూనిక్ డైలాగ్ డెలివరీ, పంచ్‌లతో బిగ్ స్క్రీన్‌పై ఎంటర్‌టైన్‌మెంట్ పంచేందుకే ప్రాధాన్యతనిచ్చారు. 70 ఏళ్ల వయసులోనూ అదే స్ట్రెంత్, అదే మ్యాడ్‌నెస్‌‌తో సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేస్తున్న రజినీ.. అభిమానుల చిరకాల వాంఛ(పొలిటికల్ ఎంట్రీ)ను కూడా సాకారం చేసేందుకు అడుగులు వేస్తున్నారు. డిసెంబర్ 12న 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న రజినీ 2020లో హెడ్ లైన్స్ టచ్ చేసి సోషల్ మీడియాలో నాలుగుసార్లు ట్రెండింగ్‌లో ఉండగా.. మరోసారి హ్యాపీబర్త్‌డే రజినీకాంత్ పేరుతో ట్విట్టర్ ట్రెండింగ్‌లోకి వచ్చారు. మరి 2020లో తలైవాస్ మోస్ట్ అటెన్షన్ క్యాచ్ చేసిన నాలుగు విషయాలు ఏంటో చూసేద్దాం.

1. లయన్ ఇన్ లంబోర్ఘిని :

రజినీకాంత్ లంబోర్ఘిని కారులో చెన్నైని చుట్టేయడం 2020లో మోస్ట్ ట్రెండింగ్ పిక్చర్స్‌లో ఒకటిగా నిలిచింది. లాక్‌డౌన్ అప్పుడప్పుడే ఎత్తేస్తున్న సమయంలో కూతురు సౌందర్యా రజినీకాంత్ కొనుగోలు చేసిన లగ్జరీ కారును రజినీ డ్రైవ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లాక్‌డౌన్ తర్వాత ఫస్ట్ టైమ్ రజినీ బయటకు రావడం.. అది కూడా వరల్డ్స్ బెస్ట్ లగ్జరీ కారు లంబోర్ఘినిలో కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దీంతో #LionInLamborgini ( లయన్ ఇన్ లంబోర్ఘిని) హ్యాష్ ట్యాగ్‌తో రజినీని ట్రెండ్ చేశారు.

2. పొలిటికల్ ఎంట్రీ :

తలైవా పొలిటికల్ ఎంట్రీ గురించి ఫ్యాన్స్ చాలా ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన రాజకీయ ప్రవేశంపై నెలకొన్న సందిగ్ధానికి ఎట్టకేలకు తెరదించిన రజినీ.. ఈ విషంయపై అధికారిక ప్రకటన ఇచ్చేశారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన తలైవా.. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో తమిళనాడు నిజాయితీ, నమ్మకం, హృదయపూర్వక, ఆధ్యాత్మిక పాలనను చూస్తుంది. డిసెంబర్ 31న పార్టీ ప్రారంభిస్తాం, జనవరి 2021 నుంచి పనులు ప్రారంభమవుతాయి’ అని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసే ఈ ప్రకటనతో#RajinikanthPolitics #RajiniPoliticalEntry హ్యాష్ ట్యాగ్స్‌తో ట్విట్టర్ ట్రెండింగ్‌లో నిలిచి మరోసారి హెడ్ లైన్స్ టచ్ చేశారు రజినీ.

3. పెరియార్ వివాదం :

సామాజికవేత్త పెరియార్ పట్ల రజినీకాంత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు 1971లో మాత్రమే కాదు 2020లోనూ హెడ్ లైన్స్‌లో నిలిచాయి. పెరియార్‌కు క్షమాపణలు చెప్పాలని అభిమాన సంఘాలు డిమాండ్ చేయగా ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. జనవరి 14న తుగ్లక్ పత్రిక గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న రజినీ.. 1971లో పెరియార్ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల విగ్రహాలను నగ్నంగా ప్రదర్శిస్తూ, దేవుళ్ల మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగిస్తారని ఊహించలేదన్నారు. పెరియార్ కాంట్రవర్సీలో అప్పుడు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని.. క్షమాపణలు చెప్పనన్నారు. ఈ సందర్భంలో #rajiniperiyar (రజినీపెరియార్) పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు రజినీ.

4. అన్నాత్తె అనౌన్స్‌మెంట్ :

జనవరిలో ‘అన్నాత్తె’ అనౌన్స్‌మెంట్‌తో తమిళనాట ఓ పండుగ వాతావరణం నెలకొంది. సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో టాలెంటెడ్ స్టార్ కాస్ట్ ఉండటం కూడా హెడ్ లైన్స్ టచ్ చేసేందుకు ఓ కారణం కాగా.. మీనా, ఖష్బూ సుందర్, కీర్తి సురేశ్, నయనతార, ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతి 2021కు విడుదల కావాల్సిన ఫిల్మ్.. కొవిడ్ కారణంగా ఆగిపోయింది. కాగా డిసెంబర్ 15 నుంచి ‘అన్నాత్తె’ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రకటించింది. ఈ మేరకు #AnnaatthePongal2021, #Annaatthe పేరుతో ఇయర్ స్టార్టింగ్‌లోనే ట్విట్టర్ ట్రెండింగ్‌లోకి వచ్చారు రజినీ.

Advertisement

Next Story

Most Viewed