- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఇండోర్ స్టేడియం అసంపూర్తిగా ఉంది.. నిధులివ్వండి’
X
దిశ, శంషాబాద్: రాజేంద్ర నగర్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రి హరీష్ రావును ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కోరారు. ఈ మేరకు గురువారం మంత్రిని హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మె్ల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. శంషాబాద్‌లో ఉన్న ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్డేట్ చేసి వైద్య పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు చేయాలని అన్నారు. మైలార్‌దేవిపల్లిలో ఉన్న ఇండోర్ స్టేడియం అసంపూర్తిగా ఉందని, స్టేడియం పనులు పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. క్రీడాకారులకు సకల వసతులు అందజేయాలన్నారు. దీనికి మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే నిధులు మంజూరు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
Advertisement
Next Story