- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టగ్ ఆఫ్ వార్ మొదలైంది
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 13వ సీజన్‌లో 23వ మ్యాచ్ మొదలైంది. ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్తాన్ రాయల్స్ టగ్ ఆఫ్ వార్‌గా తలపడుతున్నాయి. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభం అయింది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది.
ఇప్పటికే 5 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఒకే మ్యాచ్‌లో ఓడిపోయింది. మిగతా నాలుగు మ్యాచుల్లో అనూహ్య విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్ టేబుల్ టాప్ ప్లేస్‌లో ఢిల్లీ స్థానం లాంఛనమే. ఢిల్లీ బ్యాటింగ్-బౌలింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ సమిష్టిగానే రాణిస్తున్నారు. గబ్బర్ ఇంకా ఆడాల్సి ఉంది. ఇక వన్‌డౌన్-మిడిలాడర్లు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర వహిస్తున్నారు. దీనికి తోడు బౌలింగ్‌లో కగిసో రబాడా మంచి ఫలితాలు తీసుకొస్తున్నాడు.
ఇక రాజస్తాన్ రాయల్స్ ఇప్పటి వరకు 5 మ్యాచులు ఆడింది. అందులో 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. మరో మూడింట్లో ఓటమిని మూటగట్టుకుంది. రాయల్స్ బ్యాటింగ్ కూడా బలంగానే ఉంది. ఓపెనర్లు స్టీవ్ స్మిత్-జోస్ బట్లర్ చెలరేగితో స్కోర్ బోర్డు పరిగెత్తడం ఖాయం. దీనికి తోడు యంగ్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ తొలి రెండు మ్యాచుల్లో బాగా రాణించాడు. తర్వాతి మ్యాచుల్లో చిన్న చిన్న తప్పిదాలతో ఔట్ అయ్యాడు. అంతే కాకుండా దేశవాలీ క్రికెట్‌లో సంచలనంగా పేరు తెచ్చుకున్న యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ల్ కుదురు కోలేదు. దీంతో రాజస్తాన్ మూడింట్లో ఓడిపోయిందని చెప్పొచ్చు. ఇక ఈ ఆటగాళ్లు క్రీజులో నిలబడితే స్కోర్ బోర్డును బౌండరీల మీదనే లెక్కపెట్టాలి. ఇక కీలక ఆటగాళ్ల మధ్య టగ్ ఆఫ్ వార్‌గా సాగే మ్యాచ్‌లో టఫ్ ఇచ్చేది ఎవరో వేచి చూడాల్సిందే.