రాజస్థాన్ ప్రధాన న్యాయమూర్తికి పాజిటివ్..

by Shamantha N |   ( Updated:2020-08-16 06:12:10.0  )
రాజస్థాన్ ప్రధాన న్యాయమూర్తికి పాజిటివ్..
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే చాలామంది రాజకీయనేతలు, కరోనా వారియర్లు సైతం వైరస్ బారిన పడ్డారు. తాజాగా రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంద్రజిత్ మహంతి కూడా కరోనా బారిన పడ్డారు.

ఇటీవల రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌తో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా వెలువడిన రిపోర్టుల్లో సీజేకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సీఎం గెహ్లాట్ ఓ ట్వీట్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఆయ‌న హోం క్వారంటైన్‌కు వెళ్లినట్లు తెలిపారు. అయితే, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన కోలుకుంటున్నారంటూ ట్వీట్ ద్వారా సీఎం గెహ్లాట్ స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed