- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏప్రిల్‌లో తలైవా పొలిటికల్ ఎంట్రీ!
సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారన్న వార్త దాదాపు రెండేళ్లుగా చాలా మంది నోటిలో నానుతున్నది. సినిమా టైటిల్స్ పడ్డాయి. కథలోకి వెళ్లడమే మిగిలి ఉంది అన్నట్టుగా మాటలు వినిపించాయి. 2017లో రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గ్యారెంటీ అని తన అభిప్రాయాన్ని బయటికి చెప్పడంతో అరంగేట్రం లాంఛనమే అనుకున్నారు. ఇక రంగప్రవేశమే తరువాయి అన్నట్టు అభిమానులు ఒకవైపు, రాజకీయ విశ్లేషకులు మరోవైపు ఆతృతగా ఎదురుచూశారు. ఇప్పుడా అప్పుడా అనుకుంటూనే ఆయన హామీనిచ్చి రెండేళ్లు గడిచాయి. కానీ, రాజకీయ పార్టీ ప్రకటన మాత్రం రాలేదు. తోటి నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లో తన వైఖరిని స్పష్టం చేశారు. కానీ, సూపర్ స్టార్ మాత్రం తన ‘రహదారి’ ఎక్కనే లేదు. ఈ ఏడాది మాత్రం కచ్చితంగా పార్టీ పెట్టి తీరాల్సిందేనని తలైవా భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే.. ఈ ఏడాది ఏప్రిల్ లో రజనీకాంత్.. తన పార్టీ ప్రకటన చేయనున్నట్టు సమాచారం. ఒక రాజకీయ పార్టీని స్థాపించాలనుకుంటున్నట్టు రజనీకాంత్ 2017 డిసెంబర్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే.
రజనీకాంత్ ఫ్యాన్స్ క్లబ్ రాజకీయ విభాగం రజినీ మక్కల్ మాంద్రానికి చెందిన ఒక సీనియర్ కార్యకర్త మాట్లాడుతూ.. రజనీకాంత్ ఏప్రిల్ 14 తర్వాత ఏ క్షణంలోనైనా రాజకీయ పార్టీని ప్రకటించవచ్చునని తెలిపారు. అలాగే, రజనీకాంత్‌కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్, మెంటర్‌గా పేరున్న తమిళరువి మణియన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తలైవా ఏప్రిల్‌లో పార్టీని ప్రకటించే అవకాశమున్నదని అన్నారు. తేదీపై స్పష్టత లేదని చెప్పిన మణియన్ అదే రోజు.. పార్టీ తొలి కాన్ఫరెన్స్ తేదీని ప్రకటిస్తారని చెప్పారు. పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య భారీ కార్యక్రమంలో పార్టీ ప్రకటన ఉండబోతుందని తెలిపారు. ఆగస్టులో పార్టీ కాన్ఫరెన్స్‌ను నిర్వహించే అవకాశముందని, సెప్టెంబర్ మొదటివారంలో రాష్ట్రవ్యాప్తంగా టూర్ వేస్తాడని చెప్పారు. ఈ టూర్‌లో తన రాజకీయ సిద్ధాంతం, ప్రణాళికలను ప్రజలతో పంచుకుంటారని వివరించారు.
కరుణానిధి, జయలలితల మరణంతో తమిళనాడు రాజకీయాల్లో ఒక రకమైన శూన్యం ఆవరించింది. ఈ తరుణంలోనే తలైవా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీ స్థాపించిన కమల్ హాసన్.. కేంద్రంలో అధికారాన్ని సాధించిన బీజేపీకి వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్నారు. కానీ, రజనీకాంత్ మాత్రం బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఒక వేళ రజనీకాంత్ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసినా.. బీజేపీ తప్పకుండా సహకరిస్తుందన్న విశ్లేషణలున్నాయి. ఎందుకంటే.. బీజేపీకి తమిళనాడులో పట్టుదొరకడం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీకి మద్దతుపలుకుతున్న ఏఐఏడీఎంకే అధికారంలో ఉన్నప్పటికీ.. కమలం పార్టీకి రాష్ట్రంలో క్యాడర్ పెరగడం లేదు. సాక్షాత్తు ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనకు వచ్చినా.. నిరసన సెగలకు లోనుకాకతప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ పార్టీతో బీజేపీ సానుకూలంగానే మెలుగుతుందని చర్చిస్తున్నారు.