కొండా దంపతులకు రాజనాల శ్రీహరి స్ట్రాంగ్ వార్నింగ్

by Ramesh Goud |
కొండా దంపతులకు రాజనాల శ్రీహరి స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : ఖ‌బ‌డ్దార్ కొండా దంప‌తుల్లారా..! మా ఎమ్మెల్యే జోలికి వ‌స్తే ఊరుకునేది లేదంటూ టీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కుడు రాజ‌నాల శ్రీహ‌రి వార్నింగ్ ఇచ్చారు. రాజ‌కీయంగా ఉనికి చాటుకునేందుకే న‌రేంద‌ర్‌పై విమ‌ర్శలు చేస్తున్నార‌ని మండిపడ్డారు. రాజ‌కీయంగా ఎప్పుడో వారు ప‌తాన‌వ‌స్థకు చేరుకున్నారంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ నేత కొండా మురళీధర్‌రావు ప్రక‌టించిన విష‌యం తెలిసిందే.

ఈ నెల‌ 9న‌ వరంగల్‌ 26వ డివిజన్‌ లక్ష్మీపురంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో కొండా ముర‌ళీ స్థానిక ఎమ్మెల్యే న‌న్నపునేని న‌రేంద‌ర్‌పై ప‌రోక్షంగా తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు చేశారు. ఎమ్మెల్యే న‌రేంద‌ర్‌పై కొండా ముర‌ళీ చేసిన వ్యాఖ్యల‌ను రాజ‌నాల శ్రీహ‌రి తిప్పికొట్టే ప్రయ‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న శ‌నివారం వ‌రంగ‌ల్‌లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. పూట‌కో పార్టీ మార్చే కొండా దంప‌తులు ఎమ్మెల్యే న‌రేంద‌ర్‌పై విమ‌ర్శలు చేయ‌డం అవివేక‌మ‌న్నారు. న‌రేంద‌ర్ రాజ‌కీయ ఎదుగుద‌ల‌ను చూడ‌లేక అర్థంలేని విమ‌ర్శలు చేస్తున్నార‌న్నారు. కొండా దంపతులు క‌రోనా విజృంభించిన స‌మ‌యంలో వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ముఖం చూడ‌లేద‌ని దుయ్యబట్టారు. ప్రజ‌లు క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో ప‌ట్టించుకోని కొండా దంప‌తులు ఇప్పుడు రాజ‌కీయ అవ‌స‌రం కోసం నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెట్టాల‌ని చూస్తున్నార‌ని ఆరోపించారు.

Advertisement

Next Story