- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాము తాతయ్యకు జక్కన్న ట్వీట్
రాం గోపాల్ వర్మ… వివాదాలకు పెట్టింది పేరు. వర్మ తెరపైకి వచ్చాడంటే వార్ వన్ సైడ్ అవ్వాల్సిందే. రాజకీయ నాయకులకు సైతం తన సినిమాలతో ముచ్చెమటలు పట్టించాడు వర్మ. ముఖ్యంగా ఆర్జీవీకి ఎమోషన్స్ తో పనిలేదని… అసలు ఎలాంటి బంధాలు అనుబంధాలకు ప్రాముఖ్యత ఇవ్వడని అంటుంటారు జనాలు. ఇక అమ్మాయి కనబడితే అందాన్ని పొగడడం తప్ప మరేమీ చేతకాదని విమర్శిస్తుంటారు చాలామంది. కానీ సమాజంలో అమ్మాయిని టచ్ చేస్తే ఎంత ఘోరమైన శిక్ష పడుతుందో తన సినిమా ద్వారా చూపిస్తానంటూ దిశ సినిమాను ప్రారంభించారు. ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నారు కూడా.
రాం గోపాల్ వర్మకు గ్రేట్ అండ్ స్వీట్ న్యూస్ అందింది. తన కూతురు ఆదివారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆర్జీవీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇందులో కాస్త అల్లరి పట్టించేలా ఉంది దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ట్వీట్. ‘ కంగ్రాట్యులేషన్స్ రాము తాతయ్య గారు.. మొత్తానికి మీకు కళ్లెం వేసే మనవరాలు వచ్చింది అనుకుంటా .. ఇంతకీ మీరు తనతో ఏమని పిలిపించుకోవాలి అనుకుంటున్నారు?.. రాము తాత లేక రాము నాన్న లేక గ్రాండ్ పా రాము అనా..? ‘ అంటూ తమాషాగా ట్వీట్ చేశారు.