119 Pron movies కు రూ. 9 కోట్లు..

by Shyam |   ( Updated:2021-09-22 03:34:01.0  )
Rajkundra
X

దిశ, సినిమా : పోర్నోగ్రఫిక్ కేసులో అరెస్టయిన బిజినెస్ మ్యాన్ రాజ్‌కుంద్రాకు దాదాపు నెల రోజుల తర్వాత బెయిల్‌ దొరికింది. రూ.50,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు కాగా, మంగళవారం ఉదయం ముంబైలోని బైకులా జైలు నుంచి విడుదలయ్యారు. కాగా విచారణలో భాగంగా రాజ్ కుంద్రా మొబైల్, ట్యాబ్లెట్, హార్డ్ డిస్క్ డ్రైవ్ వంటి ఎలక్ట్రానిక్ డివైస్‌ల నుంచి 119 పోర్న్ మూవీస్‌ను రికవరీ చేసినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. ఈ చిత్రాలన్నింటినీ రూ. 9 కోట్ల భారీ మొత్తానికి విక్రయించేందుకు అతడు ప్లాన్ చేసినట్లు స్పష్టం చేశారు. ఇక రాజ్‌తో పాటు అతని టెక్ అసోసియేట్ ర్యాన్ థోర్ప్‌కు కూడా బెయిల్ మంజూరు చేయబడింది. ఇదిలా ఉంటే, పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు(పోర్నోగ్రఫీ కేసులో) యశ్ ఠాకూర్ అలియాస్ అరవింద్ శ్రీవాస్తవతో పాటు రాజ్ కుంద్రా సహాయకుడు ప్రదీప్ బక్షి కోసం వెతుకుతున్న దర్యాప్తు బృందం.. వారిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది.

షాకింగ్: స్టార్ డైరెక్టర్ లైంగిక వేధింపులు.. నటి పాయల్ పై యాసిడ్ దాడి

Advertisement

Next Story