అలర్ట్ : తెలంగాణకు వర్ష సూచన

by Shyam |   ( Updated:2021-10-31 22:52:05.0  )
ap-rains
X

దిశ, వెబ్ డెస్క్ : రానున్న మూడు నాలుగు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో నవంబర్ 3,4 తేదీలలో తెలంగాణ రాష్ట్రం అంతటా ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ (రూరల్), హన్మకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 48 గంటల్లో హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ (రూరల్), హన్మకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రాగల కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed