రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత : గజానన్ మాల్యా

by srinivas |
రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత : గజానన్ మాల్యా
X

దిశ, కంటోన్మెంట్ : తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్‌లో అత్యధిక నిధులను కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజనానా మాల్యా తెలిపారు. సికింద్రాబాద్ రైల్‌ నిలయంలో వర్చువల్​గా జరిగిన విలేకరుల సమావేశంలో దక్షిణ మధ్య రైల్వేకి కేటాయించిన బడ్జెట్‌ వివరాలను ఆయన వెల్లడించారు.

కేటాయింపుల వివరాలు..

* మౌలిక సదుపాయాల కల్పనకు దక్షిణ మధ్య రైల్వేకు గతేడాది రూ. 7,024 కోట్లు కేటాయించగా ఇప్పుడు రూ.7,222 కోట్లు కేటాయించారు. డబ్లింగ్‌, మూడో లైన్​, బైపాస్‌ లైన్ల పనులకు రూ.4,238 కోట్లు
* కొత్త రైల్వే లైన్లకు, క్యాపిటల్‌, డిపాజిట్‌, అదనపు బడ్జెట్‌ వనరులతో సహా మొత్తం కేటాయింపు రూ.2,195 కోట్లు
* విద్యుదీకరణ పనుల కోసం రూ.617 కోట్లు

భద్రత కోసం కేటాయింపు :

* రోడ్‌ భద్రత పనుల కోసం రూ.672 కోట్లు (లెవల్‌ క్రాసింగ్స్‌, బ్రిడ్జిలు, ఆర్‌ఓబీ/ఆర్‌యూబీ)
* స్వర్ణ చతుర్భుజి/స్వర్ణ వికర్ణ మార్గాల్లో రోడ్‌ ఓవర్‌/అండర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.374 కోట్లు
ముఖ్యమైన ప్రాజెక్టుల కోసం..
* మనోహరాబాద్‌ – కొత్తపల్లి కొత్త రైల్వే లైన్‌ ప్రాజెక్టుకు రూ.325 కోట్లు.
* భద్రాచలం-సత్తుపల్లి కొత్త రైల్వే లైన్‌ ప్రాజెక్టు కోసం రూ.267 కోట్లు.
* కోటిపల్లి-నర్సాపూర్‌ కొత్త రైల్వే లైన్‌ ప్రాజెక్టు కోసం రూ.187 కోట్లు.
* మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ కొత్త రైల్వే లైన్‌ ప్రాజెక్టు కోసం రూ.149 కోట్లు.
* అక్కన్నపేట-మెదక్‌ మధ్య కొత్త రైల్వే లైన్‌ ప్రాజెక్టుకు రూ.83.6 కోట్లు.
* కాజీపేట- బల్లార్హా 3వ లైన్‌ ప్రాజెక్టు కోసం రూ.475 కోట్లు.
* విజయవాడ -కాజీపేట -రేణిగుంట – వాడి – గుత్తి, మోటుమర్రి (ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర) వద్ద బైపాస్‌ లైన్లకు రూ.426 కోట్లు.
* కాజీపేట-విజయవాడ 3వ లైన్‌ ప్రాజెక్టుకు రూ.333 కోట్లు.
* సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లు.

విద్యుదీకరణ కోసం..

* మన్మాడ్‌-ముద్కేడ్‌-డోన్‌ సెక్షన్ల మధ్య విద్యుదీకరణకు రూ.175 కోట్లు.
* లింగపేట జగిత్యాల-నిజామాబాద్‌ విద్యుదీకరణ కోసం రూ.20 కోట్లు.
* పర్లి వైజ్యనాథ్‌-వికారాబాద్‌ సెక్షన్‌లో విద్యుదీకరణ కోసం రూ.90 కోట్లు.

ఇతర ప్రాజెక్టులకు కేటాయింపులు..

* చెర్లపల్లి స్టేషన్‌ వద్ద శాటిలైట్‌ టెర్మినల్‌ అభివృద్ధి కోసం రూ.50 కోట్లు.
* కాజీపేట వద్ద పీఓహెచ్‌ వర్కషాప్‌ కోసం రూ.2 కోట్లు.
* కర్నూలు వద్ద మిడ్‌లైఫ్‌ రిహబ్లిటేషన్​ ఫ్యాక్టరీ కోసం రూ.32.54 కోట్లు.

రాష్ట్రాల వారీగా కేటాయింపు :

* తెలంగాణలో పూర్తిగా/పాక్షికంగా మౌలిక సదుపాయాల కోసం ప్రాజెక్టు, భద్రత పనులు చేపట్టడానికి 2021-22లో బడ్జెట్ లో రూ.2,420 కోట్లు కేటాయించారు. 2014'-20 (రూ.1110 కోట్లు/సంవత్సరానికి) కంటే సగటున 118% అధికం
* ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా/పాక్షికంగా మౌలిక సదుపాయాల కోసం ప్రాజెక్టు, భద్రత పనుల చేపట్టడానికి 2021-22లో బడ్జెట్ లో రూ.5,812 కోట్లు కేటాయించారు. 2014-20 (రూ.2830 కోట్లు/సంవత్సరానికి) కంటే సగటున 105% అధికం..

Advertisement

Next Story

Most Viewed