ప్లీజ్ హెల్ప్.. అంటూ కరోనాతో నటుడు మృతి

by Shyam |
ప్లీజ్ హెల్ప్.. అంటూ కరోనాతో నటుడు మృతి
X

దిశ, సినిమా : నటుడు రాహుల్ వోహ్రా కరోనాతో చనిపోయారు. ‘మంచి చికిత్స లభిస్తే, నేను బతుకుతాను – మీ రాహుల్ వోహ్రా’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన కొద్ది గంటల వ్యవధిలో కన్నుమూశారు. ‘కానీ త్వరలోనే మళ్లీ పుడతాను, మంచి పనులు చేస్తాను, ఇప్పుడు నేను వెళుతున్నా’ అని తెలిపిన రాహుల్.. అంతకు ముందు పోస్ట్‌లో తను నాలుగురోజుల క్రితం కరోనాతో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యానని, కానీ ఎలాంటి రికవరీ లేదని చెప్పాడు. ఆక్సిజన్ లెవల్ కంటిన్యూయస్‌గా తగ్గిపోతోందని, ఏదైనా హాస్పిటల్‌లో ఆక్సిజన్ బెడ్ అవైలబుల్ ఉంటే తెలపాలని అభ్యర్థించాడు. తనను చూసుకునే వారెవరూ లేరని, ఫ్యామిలీతో టచ్‌లో లేనని, అందుకే ఈ పోస్ట్ పెడుతున్నట్లు చెప్పారు.

ఉత్తరాఖండ్‌కు చెందిన రాహుల్ కరోనా కాంప్లికేషన్స్‌తో బాధపడుతూ ఢిల్లీ హాస్పిటల్‌లో చేరగా.. బెటర్ ట్రీట్మెంట్ కోసం శనివారం సాయంత్రం ద్వారకకు తరలించినా లాభం లేకుండా పోయిందని ఇండియన్ థియేటర్ డైరెక్టర్ అరవింద్ గౌర్ తెలిపారు. రాహుల్‌ను కరోనా బలితీసుకుందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. కాగా రాహుల్.. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘అన్‌ఫ్రీడమ్‌’లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

Next Story