- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Rahul Dravid : నెక్ట్స్ కోచ్
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియాను రాబోయే రెండేళ్లలో నడిపించబోయే కోచ్ ఎవరో అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేటి నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత హెడ్ కోచ్ రవిశాస్త్రి తన పదవి నుంచి వైదొలగనున్నాడు. అదే సమయంలో రవిశాస్త్రి హయాంలో పని చేసిన సహాయక సిబ్బంది పదవీ కాలం కూడా ముగిసి పోనున్నది. దీంతో కొత్త కోచ్, ఇతర సిబ్బంది కోసం బీసీసీఐ అన్వేషణ ప్రారంభించింది. తాజాగా ‘టైమ్స్ ఆఫ్ ఇండియ’ ఒక కథనాన్ని ప్రచురించింది. బీసీసీఐ సన్నిహిత వర్గాల సమాచారం మేరకు రాహుల్ ద్రావిడ్ రాబోయే రెండేళ్లకు గాను ప్రధాన కోచ్‌గా నియమించనున్నట్లు తెలుస్తున్నది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన మూడు రోజులకే ఇండియాలో న్యూజీలాండ్ జట్టు పర్యటించనున్నది. మూడు టీ20 సిరీస్‌లో ఇండియా-న్యూజీలాండ్ తలపడనున్నాయి. అయితే రవిశాస్త్రి, అతడి సిబ్బంది పదవీ కాలం టీ20 వరల్డ్ కప్‌తోనే ముగిసిపోతున్నది. దీంతో రాహుల్ ద్రావిడ్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమిస్తారనే వార్తలు వచ్చాయి. అయితే తాత్కిలిక కోచ్‌లను నియమించడానికి బీసీసీఐలో చాలా మంది వ్యతిరేకించినట్లు తెలుస్తున్నది. తాత్కాలిక కోచ్ కంటే పూర్తి స్థాయి కోచ్‌ను నియమించడమే సరైన నిర్ణయానికి వచ్చినట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
ద్రావిడ్‌ను ఒప్పించారు…
టీమ్ ఇండియా ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన సమయంలో శ్రీలంకతో ఒక సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ప్రధాన జట్టు ఇంగ్లాండ్‌లో ఉండగా.. బీసీసీఐ మరో జట్టును పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంకకు మరో జట్టు పంపింది. అప్పుడు రాహుల్ ద్రావిడ్ తాత్కాలిక కోచ్‌గా ఉన్నాడు. అయితే రవిశాస్త్రి పదవీ కాలం ముగుస్తుందనగా.. రాహుల్ ద్రవిడ్‌నే ప్రధాన కోచ్‌గా ఉండాలంటూ బీసీసీఐ నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ అతడు సున్నితంగా తిరస్కరించి.. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ఏసీ) డైరక్టర్‌గా ఉండటానికే మొగ్గు చూపాడు. దీంతో గతంలో టీమ్ ఇండియా కోచ్‌గా పని చేసిన అనిల్ కుంబ్లేను తిరిగి ప్రధాన కోచ్‌గా నియమించడానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పావులు కదిపాడు. అయితే బోర్డులోని ఇతర సభ్యులు, టీమ్ ఇండియా జట్టు సభ్యులు కూడా ఆ ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు తెలిసింది. గతంలో కుంబ్లే కోచ్‌గా పని చేసే సమయంలో అతడితో చాలా మంది భారత క్రికెటర్లకు విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో అతడిని తిరిగి జట్టు కోచ్‌గా అంగీకరించబోమని తెలిసింది. దీంతో విదేశీ కోచ్ అయితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని బోర్డులో కొంత మంది భావించారు. అయితే స్వదేశీ కోచ్ అందులో ద్రావిడ్ లేదా కుంబ్లే పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. దీంతో బోర్డు ద్రావిడ్‌ను సంప్రదించగా అతడు ఓకే చెప్పినట్లు తెలిసింది. రాబోయే రెండేళ్ల పాటు ద్రావిడ్ కోచ్‌గా ఉండటానికి అంగీకరించడంతో త్వరలో బీసీసీఐ ఈ విషయాన్ని ధృవీకరించబోతున్నట్లు సమాచారం.
ఎన్ఏసీ డైరెక్టర్ ఎవరు?
రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం ఎన్ఏసీ డైరెక్టర్‌గా రెండో టర్మ్ బాధ్యతలను ఇటీవలే చేపట్టారు. అయితే టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడితే ఎన్ఏసీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. ఆ పదవిని ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీకి అప్పగించనున్నట్లు సమాచారం. గతంలో కూడా మూడీ ఎన్ఏసీ డైరెక్టర్‌గా పని చేశాడు. టీమ్ ఇండియా కోచ్ పదవి కోసం రెండు సార్లు దరఖాస్తు కూడా చేశాడు. అయితే రవిశాస్త్రికి కోచ్ పదవి దక్కడంతో టామ్ మూడీకి నిరాశ ఎదురైంది. బీసీసీఐ కనుక విదేశీ కోచ్‌ను తీసుకోవాలని భావిస్తే టామ్ మూడీకే ఈ పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ స్వదేశీ కోచ్ కావాలని బీసీసీఐ నిర్ణయించడంతో రాహుల్ ద్రావిడ్‌కు ఈ పదవి దక్కనున్నది.
మిగతా సిబ్బంది ఎవరు?
రాహుల్ ద్రావిడ్ ఏడాదికి రూ. 10 కోట్లు హెడ్ కోచ్‌గా జీత భత్యాలు అందుకోనున్నారు. ఈ ఏడాది నవంబర్ నుంచి 2023 వన్డే వరల్డ్ కప్ వరకు అతడి పదవీ కాలం ఉండనున్నది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే అతడు బాధ్యతలు స్వీకరించనున్నాడు. ప్రస్తుతం టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న విక్రమ్ రాథోడ్‌నే బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగించనున్నట్లు సమాచారం. ఇక రాహుత్ ద్రావిడ్‌కు నమ్మిన బంటు అయిన పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్‌గా రానున్నారు. ఫీల్టింగ్ కోచ్‌గా ఉన్న ఆర్. శ్రీధర్ కొనసాగుతారా లేదా అనేది తేలాల్సి ఉన్నది.
రాహుల్ ద్రావిడ్ కెరీర్…
ది వాల్ అని పేరు తెచ్చుకున్న రాహుల్ ద్రావిడ్ 2012లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత 2016 నుంచి 2019 వరకు ఇండియా ఏ, అండర్ 19 జట్లకు హెడ్ కోచ్‌గా పని చేశాడు. ఆయన కోచ్‌గా ఉన్న సమయంలోనే ఇండియా అండర్ 19 జట్టు 2016లో వరల్డ్ కప్ రన్నరప్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత 2018లో అదే అండర్ 19 జట్టు ద్రావిడ్ కోచింగ్‌లో వరల్డ్ కప్ సాధించింది. కోచింగ్ కెరీ్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత రాహుల్ ద్రావిడ్ 2019లో ఎన్ఏసీ డైరెక్టర్‌గా చేరారు. ఈ ఏడాది అతడి పదవీ కాలం ముగియగా.. మళ్లీ దరఖాస్తు చేసుకొని అదే పదవిలో కొనసాగుతున్నాడు. రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రావడానికి అంగీకరించడంతో.. త్వరలోనే ఎన్ఏసీ చీఫ్ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తున్నది.